Begin typing your search above and press return to search.

అండ్రాయిడ్ తాజా వెర్షన్.. ‘నోగట్’

By:  Tupaki Desk   |   1 July 2016 11:38 AM GMT
అండ్రాయిడ్ తాజా వెర్షన్.. ‘నోగట్’
X
జీవితంలో సెల్ ఫోన్ ఒక భాగమైంది. దేశంలో వినియోగించే స్మార్ట్ ఫోన్లలో అండ్రాయిడ్ ఆధారిత ఫోన్లే ఎక్కువన్న విషయం తెలిసిందే. తన వెర్షన్ ను ఎప్పటికప్పుడు మార్చే అండ్రాయిడ్ తాజాగా మరోకొత్త వెర్షన్ ను తీసుకొచ్చేసింది. ఇప్పటివరకూ అందుబాటులో న్న మార్ష్ మాలో తర్వాతి వెర్షన్ గా ఈ నొగట్ ను చెప్పుకోవచ్చు. ఎప్పటి మాదిరి తియ్యటి పదార్థంతో తన ఒఎస్ పేరు పెట్టుకునే అండ్రాయిడ్ ఈసారీ అదే విధానాన్ని అనుసరించింది.

ఇంగ్లిషు అక్షర మాలను వరుస క్రమంలో ఫాలో అయ్యే అండ్రాయిడ్ వరుసగా.. కిట్ కాట్.. లాలీపాప్.. మార్ష్ మాలో అంటూ పేర్లు పెడుతోంది. తాజాగా విడుదల చేయనున్న వెర్షన్ ను నొగట్ పేరును కన్ఫర్మ్ చేసింది. ఐస్ క్రీం.. చాక్లెట్ పేర్లతో అలరించిన గూగుల్.. ఈసారి కూడా స్వీట్ పేరునే ఎంపిక చేసుకుంది. తేనె.. కోడిగుడ్డు తెల్లసొన.. పప్పులతో తయారు చేసే ఈ స్వీటుకు ఆదరణ ఎక్కువే. యూరోప్ లో ప్రముఖమైన ఈ స్వీట్ ను తన తాజా వెర్షన్ పేరుగా గూగుల్ ఎంపిక చేసుకుంది.

ఈ కొత్త వెర్షన్ తో ఒకే విండో మీద మల్టిఫుల్ యాప్స్ ను సపోర్ట్ చేసేలా ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు.. స్ప్లిట్ స్ర్ర్కీన్ మోడ్ లో రెండు యాప్ లను ఒకేసారి యూజర్లు విండో మీద ఆపరేట్ చేసే అవకాశాన్ని కల్పిస్తుందని చెబుతున్నారు. మాటలు సరే.. చేతల్లో ఈ కొత్త వెర్షన్ ఎలా ఉంటుందో చూడాలి.