Begin typing your search above and press return to search.

అమెరికాలో ఆంధ్రా విద్యార్థికి 10 ఏళ్ల జైలు

By:  Tupaki Desk   |   20 April 2019 9:33 AM GMT
అమెరికాలో ఆంధ్రా విద్యార్థికి 10 ఏళ్ల జైలు
X
అమెరికాలో న్యాయ విచారణ వేగవంతంగా ఉండటంతో పాటు, తప్పులకు శిక్షలు కూడా కఠినంగా ఉంటాయి. నేరాలపై కఠినంగా వ్యవహరించే ఉద్దేశ్యంతో అక్కడ చట్టాలు కఠినంగా తయారు చేయడం జరిగింది. తాజాగా అమెరికాలో తెలుగు విద్యార్థి విశ్వనాథ్‌ కు 10 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తోంది. అతడు తాను చదువుతున్న కాలేజ్‌ లో ఉన్న 66 కంప్యూటర్లను కిల్లర్‌ డివైజ్‌ ను ఉపయోగించి పని చేయకుండా చేశాడు. దాంతో అతడిపై కేసు నమోదు అయ్యింది. ఇప్పుడు అతడికి శిక్ష పడబోతుంది.

ఈ కేసు పూర్తి వివరాల్లోకి వెళ్తే... ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన ఆకుతోట విశ్వనాధ్‌ అనే 27 ఏళ్ల విద్యార్థి న్యూయార్క్‌ లోని ది కాలేజ్‌ ఆఫ్‌ సెయింట్‌ రోజ్‌ లో చదువుతున్నాడు. కొన్ని కారణాల వల్ల కాలేజ్‌ పై కక్ష పెంచుకున్న విశ్వనాథ్‌ కొన్నాళ్ల క్రితం కిల్లర్‌ డివైజ్‌ టెక్నాలజీతో ల్యాబ్‌ లో ఉన్న కంప్యూటర్‌ లు పనికి రాకుండా చేశాడు. అతడు చేసిన పని వల్ల దాదాపు 40 లక్షల రూపాయల ఆస్తి నష్టం అయినట్లుగా పోలీసులకు కాలేజ్‌ ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిబ్రవరిలో అరెస్ట్‌ అయిన విశ్వనాథ్‌ తాజాగా నేరం అంగీకరించడంతో పాటు నష్టపర్చిన 40 లక్షల రూపాయలను చెల్లించేందుకు ఓకే చెప్పాడు. అయినా కూడా 10 ఏళ్ల జైలు శిక్ష మరియు 1.75 కోట్ల రూపాయల జరిమానా విధించే అవకాశం ఉందని స్థానిక న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇక గ్లోబల్‌ కాల్‌ సెంటర్‌ స్కాంలో భాగస్వామ్యుడు అయినందుకు భారతీయుడు అయిన హేమాల్‌ కుమార్‌ కు 8 ఏళ్ల జైలు శిక్ష విధించడంతో పాటు, 80 వేల డాలర్ల జరిమానా కూడా విధించారు. సంచలనం అయిన గ్లోబల్‌ కాల్‌ సెంటర్‌ స్కాంలో ఇండియన్‌ ఉండటం అందరికి ఆశ్చర్యంను కలిగించింది.