Begin typing your search above and press return to search.

ఏపీలో ఇంటెలిజెన్స్ చీఫ్ బదిలీ!

By:  Tupaki Desk   |   27 March 2019 4:06 AM GMT
ఏపీలో ఇంటెలిజెన్స్ చీఫ్  బదిలీ!
X
ఎన్నికల వేల ఎలక్షన్‌ కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ వెంకటరత్నం - కడప ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మలను ఎన్నికల విధుల నుంచి తప్పించింది. వారిద్దర్ని హెడ్‌ క్వార్టర్స్‌ అటాచ్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక ఏపీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ వెంకటేశ్వరరావును బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా వీరి ముగ్గురికి ఎన్నికల విధులు అస్సలు అప్పగించవద్దని ఆదేశాలు జారీ చేసింది.

ఎన్నికల్లో ప్రభుత్వానికి అనుకూలంగా కడప - శ్రీకాకుళం పోలీస్‌ బాస్‌ లు పనిచేస్తున్నారని వైఎస్ జగన్‌ గత నెలరోజుల నుంచి విమర్శిస్తున్నారు. అంతేకాకుండా వైఎఎస్‌ వివేకానంద హత్య తర్వాత కడప జిల్లా ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మ సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని.. అందువల్లే వారిద్దర్ని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది వైసీపీ. అంతేకాదు వైఎస్‌ వివేక హత్యకేసులో ఇంటిలిజెన్స్‌ డీజీ వెంకటేశ్వరావు జోక్యం చేసుకుంటున్నారని.. కొన్ని జిల్లాల్లో వైసీపీ అభ్యర్థుల్ని కూడా ఆయన బెదిరిస్తున్నారని జగన్ ఆరోపణలు చేశారు. అంతేకాకుండా వైసీపీకి చెందిన కొందరు నాయకులు ఇదే విషయంపై ఢిల్లీలో ఎన్నికల కమిషనర్‌ ని కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో.. ఇంటిలిజెన్స్ డీజీని - కడప - శ్రీకాకుళం జిల్లా ఎస్పీలను బదిలి చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు వారు ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని చెప్పింది. వారి స్థానంలో వేరే అధికారుల్ని నియమించాలని ఆదేశించింది ఈసీ.