Begin typing your search above and press return to search.

నమ్మలేని నిజం... ఏపీలో అవినీతి తగ్గిందట

By:  Tupaki Desk   |   19 Aug 2017 4:18 AM GMT
నమ్మలేని నిజం... ఏపీలో అవినీతి తగ్గిందట
X
ఏపీలో అవినీతి గణనీయంగా తగ్గిందట. ప్రస్తుతం అవినీతిలో ఏపీ 19వ స్థానంలో ఉంది. 2017 సంవత్సరానికి సంబంధించి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనమిక్స్ రిసెర్చ్ (ఎన్‌ సిఐఆర్‌ ఎ) సర్వేలో ఈ సంగతి తేలింది.

ప్రభుత్వ పథకాల అమలులో - పాలనలో రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి అడ్డుకట్ట వేస్తూ - పారదర్శకతకు - అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని.. ఎన్‌ సిఐఆర్‌ ఎ సర్వేలోనూ ఇదే సంగతి వెల్లడైందని రాష్ర్ట ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఈ సర్వేలో ఆంధ్రప్రదేశ్ 19వ స్థానంలో నిలిచిందని.. వచ్చే ఏడాది ఈ ర్యాంకు మరింత తగ్గి 24వ స్థానానికి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. పరిష్కార వేదిక 1100 పేరుతో ప్రభుత్వం చేపడుతున్న చర్యలు రాష్ట్రంలో అవినీతికి అడ్డుకట్ట వేయడంతో ర్యాంకు మెరుగుపడినట్లు చెప్తున్నారు.

కాగా గత ఏడాది ఏపీ ఈ ర్యాంకింగుల్లో మూడో స్థానంలో ఉండేది. దీంతో విపక్షం చంద్రబాబు ప్రభుత్వాన్ని అప్పట్లో ఉతికి ఆరేసింది. ఇప్పుడు అవినీతి తగ్గినట్లు కేంద్ర సర్వేలు వెల్లడించడంతో చంద్రబాబు అండ్ కో ఊపిరిపీల్చుకుంది.