వ్యక్తిగత విమర్శలు రాజకీయమా..!

Wed Jan 16 2019 20:00:01 GMT+0530 (IST)

ప్రజాసేవ చేయాడానికే మేము రాజకీయాలలోకి వచ్చాం అంటూ ప్రతీ రాజకీయ నాయకుడు చెబుతాడు. కాని గత కొన్ని సంవత్సారాలుగా రాజకీయం కొత్త రంగు పులుముకుంటోంది. ప్రతిపక్షాలను ఎండగట్టే ప్రయత్నంలో విమర్శలు హద్దులు దాటుతున్నాయి. దీనికి సోషల్ మీడియాను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. అయితే విలువలు లేని రాజకీయాలు సమాజానికి ఎంత వరకూ మేలు చేస్తాయి. అధికారం కోసం చివరికి మహిళలను కూడా వదలటం లేదు. వారి వ్యక్తిగత జీవితాలోకి కూడా వెళ్లి వారిని రోడ్డున పడేస్తున్నారు. ఇది మన తెలుగు రాష్ట్రాలకే పరిమితం అనుకుంటే పొరపాటే - అన్నీ రాష్ట్రాలోను కూడా ఇదే పరిస్ధితి. రాజకీయాలలో విపాక్షాలను ఎండగట్టే ప్రయత్నంలో నాయకులు తమ స్దాయి మరచి మాట్లాడుతున్నారు.  ఎన్నికల ముందు ప్రతిపక్షా పార్టీలను పలుచన చేసి తద్వారా తాము లబ్ది పొందుదామని ఈ తరహా వ్యాఖ్యలకు తెర తీస్తున్నారు.గతంలో ఈ తరహా రాజకీయాలు తమిళనాడులో ఉండేవి. బద్ద శత్రువులైన మాజీ ముఖ్యమంత్రులు జయలలిత - కరుణానిధిలు ఈ తరహా మాటల రాజకీయాలకు తెరలేపారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జయలలిత అధికారంలో ఉన్నప్పుడు తన ప్రతిపక్ష నేత అయిన కరుణానిధిపై కేసులు పెట్టి ఆయన్ని అరెస్టు చేయించారు. ఆ తర్వాత కరుణానిధి కూడా జయలలితపై అక్రమ ఆస్తుల కేసులు పెట్టి ఆమెను ఇబ్బంది పెట్టారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కూడా నాయకులు వ్యక్తిగత విమర్శలు చేస్తూ తమ స్దాయిని తగ్గించుకుంటున్నారని విశ్లేషకులు అంటున్నారు. 2014 ఎన్నికల ముందు మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి కుమార్తే అయిన షర్మిలపై తెలుగుదేశం పార్టీ నాయకులు షర్మిలకు ప్రభాస్ అనే వ్యక్తితో సంబంధాలు ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా వివాదానికి తెర లేపారు. అయితే ఆ వివాదం సద్దుమణిగింది అనుకుంటున్న తరుణంలో మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆ వివాదానికి మళ్లీ ఆజ్యం పోస్తున్నారు రాజకీయా నాయకులు. జనసేన అధినేత అయిన పవన్ కల్యాన్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని - పవన్ పై కూడా వ్యక్తిగత విమర్శలకు దిగారు. మూడు పెళ్లిళ్లు చేసుకుని ఒక నిబద్దతలేని జీవితాన్ని వెల్లదీస్తున్న పవన్ ప్రజలకు ఏం న్యాయం చేస్తారంటూ సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోసారు. ఇలా రాజకీయాలలోకి వచ్చి తాము గతంలో ప్రజలకు ఏం చేసామూ..... భవిష్యత్తులో ఏం చేద్దామనుకుంటున్నామో చెప్పడం మానేసీ ప్రతిపక్షనేతలను వారి దగ్గర బంధువులను వ్యక్తిగత విమర్శలు చేస్తూ తమ పబ్బం గడుపుకోవాలనుకుంటున్న ఈ నాయకులకు ప్రజలు బాగా బుద్ది చెబుతారని విశ్లేషకులు అంటున్నారు.