Begin typing your search above and press return to search.

చిదంబరం అరెస్ట్.. భిన్నంగా ఆంధ్రోళ్ల రియాక్షన్..!

By:  Tupaki Desk   |   22 Aug 2019 4:46 AM GMT
చిదంబరం అరెస్ట్.. భిన్నంగా ఆంధ్రోళ్ల రియాక్షన్..!
X
అవినీతి ఆరోపణలతో పేరున్న నేత అరెస్ట్ అయ్యారన్నంతనే.. సదరు నేత మీద సానుభూతి పెల్లుబుకుతుంది. అవినీతి ఆరోపణలతో అరెస్ట్ కావటమే కానీ.. ఆ ఆరోపణలు నిజమని తేలిన వైనాలు చాలా తక్కువగా కనిపిస్తాయి. పేరున్న నేతల మీద అవినీతి ఆరోపణల వెనుక.. రాజకీయ కారణాలు ఎన్ని ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కారణంతోనే.. అరెస్ట్ అయిన నేతల మీద ప్రజల్లో సానుభూతి వస్తుంటుంది. అప్పుడెప్పుడో కుంభకోణానికి పాల్పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కేంద్రమంత్రి చిదంబరం తాజాగా అనూహ్య రీతిలో అరెస్ట్ కావటం తెలిసిందే.

ఆయన అరెస్ట్ వార్త విన్నంతనే సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ పెల్లుబికిన స్పందన రోటీన్ కు భిన్నంగా ఉండటం విశేషం. చిదంబరం అరెస్ట్ వార్తకు ఆంధ్రోళ్ల స్పందన మిగిలినోళ్ల రియాక్షన్ కు పొంతన లేకుండా ఉండటం ఆసక్తికరంగా మారింది. చిదంబరం అరెస్ట్ వెంటనే.. చేసిన పాపం ఊరికే పోతుందా? అని ఒకరు.. రూల్స్ బ్రేక్ చేస్తే ఇలానే ఉంటుందని మరొకరు.. జగన్ విషయంలో చేసిన తప్పునకు సరైన శిక్ష పడిందని ఇంకొకరు.. ఏళ్లకు ఏళ్లుగా సాగే ధర్మాన్ని తన స్వార్థానికి వాడుకుంటే ఇలానే ఉంటుందన్న వ్యాఖ్యలు వినిపించాయి.

ఎవరు అవునన్నా.. కాదన్నా.. అత్యున్నత స్థానాల్లో ఉన్న వారు అనుకోని రీతిలో చేసే తప్పుల్ని.. తర్వాత పవర్ లోకి వచ్చే వారు చూసీచూడనట్లుగా వ్యవహరించటం.. వారి విషయంలో అనవసర రచ్చకు గురి కావటం చేయటం మామూలుగా జరిగేదే. కానీ.. పదేళ్ల పాటు సాగిన యూపీఏ ప్రభుత్వాలలో అత్యంత శక్తివంతమైన చిదంబరం.. గేమ్ రూల్ ను మార్చేలా వ్యవహరించారన్న విమర్శ ఉంది.

ఎప్పటి నుంచో అమల్లో ఉండే అప్రకటిత నిబంధనల్ని.. చౌకబారు రాజకీయం కోసం మార్చేశారని.. అందుకే ఇప్పుడాయన ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. అంతేకాదు.. ఏపీ విభజన విషయంలో చిదంబరం తంబి వ్యవహరించిన తీరు ఆంధ్రోళ్ల మనోభావాల్ని తీవ్రంగా గాయపరిచాయి. ఇది కూడా.. ఆయనకు జరగాల్సిన శాస్తి జరిగినట్లుగా పలువురు వ్యాఖ్యానించటం గమనార్హం. ఏపీ విభజన విషయంలో దుర్మార్గంగా వ్యవహరించిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక రీతిలో ఇబ్బంది పడుతున్నారని.. తాజాగా చిదంబరం ఒక ఉదాహరణగా పలువురు ఆంధ్రోళ్లు వ్యాఖ్యానించటం కనిపిస్తోంది. అత్యున్నత పదవులు ఎన్ని చేపడితే మాత్రం ఏం లాభం..? చివరకు.. జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి తెచ్చుకోవటానికి మించిన విషాదం మరేం ఉంటుంది