Begin typing your search above and press return to search.

పోలవరం ప్రధాన రీటెండర్లో 628 కోట్ల ఆదా

By:  Tupaki Desk   |   23 Sep 2019 10:56 AM GMT
పోలవరం ప్రధాన రీటెండర్లో 628 కోట్ల ఆదా
X
మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ ఫాస్ట్రక్చర్ సంస్థ.. క్లుప్తంగా ‘మెయిల్’.. ఎన్నో ఏళ్ల తెలంగాణ సాగునీటి కల.. కేసీఆర్ కలలుగన్న కాళేశ్వరాన్ని ప్రపంచమే అబ్బురపరిచేలా మూడేళ్లలో పూర్తి చేసింది ఇదే ‘మేఘా’ సంస్థ. మేఘా చేపట్టిన కాళేశ్వరం.. భూగర్భంలో పంప్ హౌస్ లు ఇలా ఇంజనీరింగ్ ప్రతిభకు సాక్షాత్కారంగా ఈ ప్రాజెక్ట్ నిలిచింది. అలాంటి మేఘా చేతిలో ఇప్పుడు ఏపీ భవిష్యత్తును నిర్ణయించే కీలక ప్రాజెక్టు పడింది.

టీడీపీ నాయకుల దోపిడీకి బలైపోయిన పోలవరం ప్రాజెక్ట్ చంద్రబాబు ఐదేళ్ల పాలనలో పూర్తికాకుండా ఏపీ ప్రజల ఆశలను నీరుగార్చింది. చంద్రబాబు అండ్ ఆయన కాంట్రాక్టర్ల ధనదాహానికి బలైపోయిందని వైసీపీ అధికారంలోకి వచ్చాక నిగ్గుతేల్చింది. టీడీపీ తీరును ఎండగట్టింది. అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ మిగిలిపోయిన పోలవరం పనులను రద్దు చేసి రివర్స్ టెండర్ కు వెళ్లారు. దీనిపై టీడీపీ సహా ఎన్ని విమర్శలు వచ్చినా లెక్కచేయలేదు. పోలవరం హెడ్ వర్క్స్ తోపాటు జల విద్యుత్ కేంద్రాలను కలిపి ప్రభుత్వం రివర్స్ టెండర్ పిలిచింది. ఆ పనుల విలువను రూ.4987 కోట్లుగా నిర్ణయించింది.

తాజాగా ఈ రివర్స్ టెండరింగ్ లో మేఘా సంస్థ పాల్గొంది. ఈ పనులను గతంలో వివిధ సంస్థలు చేపట్టిన ధర కంటే -12.6% తక్కువకు శాతానికి అంటే 4358 కోట్ల మొత్తానికి చేపట్టేందుకు మేఘా సంస్థ బిడ్ వేసి ముందుకొచ్చింది. దేశంలో ఇంతవరకు ఎక్కడా లేని విధంగా ఎల్-1గా వచ్చిన సంస్థ కోట్ చేసిన ధరను ప్రాథమిక అంచనా వ్యయంగా పరిగణలోకి తీసుకుని దాని ఆధారంగా బిడ్డింగ్ నిర్వహించారు. దీనివల్ల ప్రభుత్వానికి ఏకంగా రూ.628 కోట్ల నిధుల ఆదా అయ్యింది. జగన్ సర్కారు చెబుతున్న రివర్స్ టెండరింగ్ దక్కిన ప్రతిఫలమిదీ..

ఇప్పటికే రికార్డు సమయంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని పూర్తి చేయటంతోపాటు ప్రపంచంలోనే అతిపెద్దదైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని శరవేగంగా నిర్మించిన మేఘా ఇప్పుడు ఏపీ కలల ప్రాజెక్ట్ ను పూర్తి చేసేందుకు సిద్ధమైంది. . పోలవరం బిడ్ ఓపెన్ చేసిన ప్రభుత్వం అవసరమైన ప్రక్రియను పూర్తిచేసిన వెంటనే నిర్మాణ పనులు చేపట్టేందుకు మేఘా ఇంజనీరింగ్ సిద్ధమౌతోంది. కాళేశ్వరంను రికార్డ్ స్థాయిలో పూర్తి చేసిన మేఘా ప్రభుత్వం నిర్ధేశించిన గడువులోగా ఈ పోలవరం బహుళార్ధ సాధక ప్రాజెక్టును పూర్తి చేయాలనే కృతనిశ్చయంతో ముందుకెళుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ‘మేఘా’ పోల‘వరం’గా మారనుంది..