Begin typing your search above and press return to search.

ఏపీలో భూముల ఇస్తే...ఎన్ని లాభాలో....

By:  Tupaki Desk   |   28 Aug 2015 3:34 PM GMT
ఏపీలో భూముల ఇస్తే...ఎన్ని లాభాలో....
X
తెలుగుదేశం నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం గన్నవరం ఎయిర్ పోర్టు అభివృద్ధి కోసం ల్యాండ్ పూలింగ్‌ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా భూములిచ్చే రైతులకు బంపర్ ఆఫర్లను కూడా ప్రకటించింది. అలాగే పదేళ్ల పాటు వార్షిక చెల్లింపులు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో చెప్పింది. రైతులను ఒప్పించి వారి నుంచి భూమలు తీసుకోవాలనే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. దీని కోసం ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం కింద పట్టాలివ్వాలని నిర్ణయించింది.

ఎయిర్ పోర్టు అభివృద్ధి కోసం భూములిచ్చే రైతులకు ఏపీ రాజధాని అమరావతిలో ప్లాట్లు ఇస్తామని ప్రకటించింది. ఎన్‌రోల్‌మెంట్, వక్ఫ్‌ భూములు ఎకరం ఇస్తే వారికి అమరావతిలో రెసిడెన్షియల్‌ కోసం వెయ్యి గజాలు, వాణిజ్య సముదాయానికి 450 గజాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసైన్డ్‌ భూములిచ్చే రైతులకు 800 గజాల రెసిడెన్షియల్‌ ప్లాట్‌ తో పాటు 200 గజాల కమర్షియల్ స్పేస్‌ ఇచ్చేందుకు సర్కార్‌ ముందుకొచ్చింది. ఎకరం కంటే తక్కువ భూమి ఇస్తే పదేళ్లపాటు 50 వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయానికి వచ్చింది ఏపీ స‌ర్కారు.

మొత్తంగా గ‌న్న‌వ‌రంలో ఎయిర్‌ పోర్టును అభివృద్ధి చేయ‌డంపై ప‌ట్టుద‌ల‌తో ఉన్న ప్ర‌భుత్వం ఆ క్ర‌మంలో దూకుడుగా ముందుకువెళ్ల‌డం..అదే క్ర‌మంలో ఇటు రైతుల‌కు పెద్ద ఎత్తున న్యాయం చేయ‌డం హ‌ర్ష‌నీయ‌మే.