Begin typing your search above and press return to search.

ఏపీ కేబినెట్ 8 గంట‌ల భేటీ..కీల‌క నిర్ణ‌యాలివే

By:  Tupaki Desk   |   10 Oct 2015 2:33 PM GMT
ఏపీ కేబినెట్ 8 గంట‌ల భేటీ..కీల‌క నిర్ణ‌యాలివే
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అధ్యక్ష‌త‌న విజ‌య‌వాడ‌లో సుదీర్ఘంగా 8 గంటలపాటు స‌మావేశ‌మైన ఏపీ కేబినెట్ ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. దాదా ప్ర‌తి అంశంపై మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రులకు చంద్ర‌బాబు పూర్తి వివ‌రాలు వెల్ల‌డించారు.ఈ సమావేశంలో పోలవరంతోపాటు అమరావతి శంకుస్థాపన అంశాలు ప్రధానంగా చర్చించారు.

అవి...

- రాజధాని శంకుస్థాపనకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఈనెల 18 న ఆహ్వానించాలని నిర్ణయించారు.

- పోల‌వ‌రం త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేసేందుకు ప్ర‌భుత్వం త‌ర‌ఫున విధివిధానాలు సిద్ధం చేయాల‌ని అధికారుల‌కు ఆదేశం.

- రాజ‌ధాని నిర్మాణం విష‌యంలో గ్రీన్ ట్రిబ్యున‌ల్ నోటిస్‌తో వ‌చ్చిన ఇబ్బందేమీ లేదు.

- స్ప‌ష్ట‌మైన వివ‌రాల‌తో అధికారులు నివేదిక సిద్ధం చేసి ట్రిబ్యున‌ల్‌కు స‌మ‌ర్పించాలి.

- శంఖుస్థాప‌న ఘ‌నంగా, విజ‌య‌వంతంగా జ‌రిగేలా చూడాలి.

-వీఐపీల ఏర్పాట్ల‌కు ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ప‌ర్య‌వేక్షించాలి. ఈ బాధ్య‌త‌ల‌ను మంత్రులే తీసుకోవాలి.

- తెలంగాణ మంత్రులు, నేతలకు కూడా ఆహ్వానాలు అందించేందుకు కేబినెట్ అంగీకారం.

- రాజమండ్రిని రాజమహేంద్రవరంగా మారుస్తూ క్యాబినేట్‌ ఆమోదం తెలిపింది.

- శంఖుస్థాప‌న‌కు ప్రతిపక్ష నేత నుంచి గ్రామ సర్పంచ్‌, వార్డు మెంబర్లందరికీ ఆహ్వానాలు పంపించాలనే నిర్ణయం తీసుకున్నారు.