లైవ్ అప్ డేట్స్ : ఎన్నికల ఫలితాలు 2019

Thu May 23 2019 14:33:19 GMT+0530 (IST)

* టెక్కలి లో అచ్చెన్నాయుడు గెలుపు
* గాజువాక లో పవన్ కళ్యాణ్ వెనుకంజ
* మంగళగిరి లో ఆళ్ల రామకృష్ణ రెడ్డి గెలుపు
* గల్లా జయదేవ్ ముందంజ
* జనసేన బోణీ...రాజోలులో పార్టీ అభ్యర్థి విజయం  
* నిమ్మకాయల చినరాజప్ప 4000 ఓట్లతో గెలుపు
* ఎర్రన్నాయుడు కూతురు అదిరెడ్డి బావని రాజమండ్రి అర్బన్ లో గెలుపు
* రేణుక చౌదరి ఖమ్మం లో ఓటమి
* వైస్ జగన్ 90543 ఓట్లతో గెలుపు
* బొత్స సత్య నారాయణ  గెలుపు
* మాండ్య లో సుమలత గెలుపు
* పవన్ కళ్యాణ్ భీమవరం లో ఓడిపోయాడు
* చిత్తు చిత్తుగా ఓడిన చింతమనేని
* నారా లోకేష్ మంగళగిరి లో ఓటమి
...........................................ఏపీలో వైసీపీ ప్రభంజనం కొనసాగింది.. దాదాపు 152 స్థానాల్లో వైసీపీ ఆధిక్యాన్ని కనబరుస్తోంది. కొన్ని స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఇప్పటికే విజయం సాధించారు. ఇక తెలంగాణలోనూ కాంగ్రెస్ బీజేపీ టీఆర్ ఎస్ అభ్యర్థులు గెలిచారు.  పలు స్థానాల్లో గెలుపొందిన వైసీపీ టీడీపీ టీఆర్ ఎస్  విజేతల వివరాలు ఇవే..

* ఏపీలో వైసీపీ పార్టీ నుంచి గెలిచిన విజేతలు వీరే..
*పులివెందులలో వైసీపీ అభ్యర్థి జగన్ ఘనవిజయం సాధించారు.
* చిత్తూరు జిల్లా నగరి నుంచి వైసీపీ ఎమ్మెల్యే రోజా గెలిచారు.
* చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 
* పేర్ని నాని మాచర్ల(గుంటూరు జిల్లా)
* పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కడప వైసీపీ అభ్యర్థి
* అమ్జద్ భాషా పామర్రు(కృష్ణా జిల్లా)
* అనిల్ కుమార్ వైసీపీ గజపతినగరం(విజయనగరం జిల్లా)
* పెడన(కృష్ణా జిల్లా) ఎమ్మెల్యే జోగి రమేష్ * నెల్లిమర్ల(విజయనగరం జిల్లా) వైసీపీ ఎమ్మెల్యే
* బొడ్డుకొండ అప్పలనాయుడు- మచిలీపట్నం(కృష్ణా జిల్లా)  వైసీపీ అభ్యర్థి
* బొత్స అప్పలనర్సయ్య -విజయనగరం
* కోలగట్ల వీరభద్రస్వామి -పార్వతీపురం(విజయనగరం)
* జోగారావు- చింతలపూడి(పశ్చిమగోదావరి)
* వైసీపీ అభ్యర్థి ఎలీజా
ఇక రఘురామరెడ్డి(మైదుకూరు) రాజా ఇంద్రావతి(రాజా నగరం) అబ్బయ్య చౌదరి(దెందులూరు) పుప్పాల శ్రీనివాసరావు(ఉంగుటూరు)
*కడప లోక్ సభ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి గెలుపొందారు.
*నెల్లూరు జిల్లా సర్వేపల్లి తెదేపా అభ్యర్థిసోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఓటమిపాలయ్యారు. కాకాని గోవర్ధన్ రెడ్డి  గెలిచారు. సోమిరెడ్డికి ఇది వరుసగా నాలుగో ఓటమి
*కడప జిల్లా రాజంపేట లోక్ సభ వైకాపా అభ్యర్థి పి.వి.మిథున్ రెడ్డి ఘన విజయం సాధించారు.
*పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ప్రసాదరాజు అవనిగడ్డలో సింహాద్రి రమేష్ బాబు రాజానగరంలో జక్కంపూడి రాజా విజయం సాధించారు


*గెలిచిన టీడీపీ అభ్యర్థులు వీరే..
* కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో చంద్రబాబు విజయం సాధించారు.
*తూర్పుగోదావరి: రాజమండ్రి గ్రామీణం తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి గోరంట్ల బుచ్చియ్య చౌదరి విజయం సాధించారు.
* తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అర్బన్ నియోజకవర్గ  టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి భవానీ విజయం సాధించారు.
*చినరాజప్ప విజయం: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప విజయం సాధించారు. 

*తెలంగాణలో విజేతలు వీరే..
*కరీంనగర్-బండిసంజయ్ (బీజేపీ)
*మల్కాజి గిరి - రేవంత్ రెడ్డి (కాంగ్రెస్)
*జహీరాబాద్ - బీబీ పాటిల్ (టీఆర్ ఎస్)
*వరంగల్ -దయాకర్ (టీఆర్ ఎస్)
*ఆదిలాబాద్ -బీజేపీ అభ్యర్థి విజయం
*చేవెళ్ల - విశ్వేశ్వరరావు (కాంగ్రెస్)
*భువనగిరి - కోమటిరెడ్డి వెంకటరెడ్డి (కాంగ్రెస్)
*ఖమ్మం -నామా నాగేశ్వరరావు (టీఆర్ ఎస్)


.........................................

దేశంలోని 542 నియోజకవర్గాల ఫలితాలను చూస్తే బీజేపీ సారథ్యంలోని బీజేపీ 348 స్థానాల్లో అఖండ మెజార్టీని సాధించింది.  కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ  87 స్థానాల్లో ఇతరులు 107 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

*ఏపీ ఎన్నికల ఫలితాలను చూస్తే
వైసీపీ 152 సీట్లలో ఆధిక్యం కనబరుస్తూ ప్రభంజనం సృష్టిస్తోంది. టీడీపీ 23 స్థానాల్లోనే ఆధిక్యం కనబరుస్తోంది. జనసేన ఒక్కస్థానం కూడా గెలిచే పరిస్థితి కనిపించడం లేదు.

తెలంగాణలో మిశ్రమ ఫలితాలు టీఆర్ఎస్ కు షాకిచ్చాయి. బీజేపీ 4 స్థానాల్లో కాంగ్రెస్ 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉండడం  సంచలనంగా మారింది. కారు సర్కారు పదహారును జనాలు పట్టించుకోలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీలకు ఓటేయడం విశేషంగా చెప్పవచ్చు.

*భువనగిరి లోక్ సభ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థిపై బూర నర్సయ్య గౌడ్ గెలుపొందారు.

*మెదక్ లో టీఆర్ఎస్ అభ్యర్ధి ప్రభాకర్ రెడ్డి గెలిచారు.

*వరంగల్ లో టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ గెలిచారు.

*నల్గొండ పార్లమెంట్ సీటులో పీసీసీ చీఫ్ ఉత్తమ్ విజయం ముగింట నిలిచారు.

*మల్కాజిగిరిలో టీఆర్ఎస్ కాంగ్రెస్ హోరాహోరీగా సాగుతోంది. కేవలం 10వేల ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.

*కరీంనగర్ లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ 77వేల ఓట్ల మెజార్టీతో ఉన్నారు.

*సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి 35203 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

*నాగర్ కర్నూల్ లో టీఆర్ ఎస్ అభ్యర్థి రాములు ఘనవిజయం సాధించారు. లక్షా 80వేల ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి పై గెలుపొందారు.

*చేవెళ్లలో కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుపు ఖాయం చేసుకున్నారు.

*ఖమ్మంలో టీఆర్ ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలిచారు.

*మహబూబాబాద్ లో టీఆర్ ఎస్ అభ్యర్థి మాలోతు కవిత విజయం సాధించారు.

............................................

మధ్నాహ్నం 1.30 వరకు దేశంలోని 542 నియోజకవర్గాల ఫలితాలను చూస్తే బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ 100కు అటు ఇటుగానే సాధిస్తోంది. ఇక ఏపీలో వైసీపీ ప్రభంజనం కొనసాగుతోంది.150 సీట్లకుపైగా సాధిస్తోంది. టీడీపీ కేవలం 25లోపే సీట్లకు పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

* దేశంలో మధ్నాహ్నం వరకు ఆధిక్యాన్ని చూస్తే..
బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ 348 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక కాంగ్రెస్ సారథ్యంలోని  87 స్థానాల్లో ఇతరులు 107 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

*ఏపీ ఎన్నికల ఫలితాలను చూస్తే
వైసీపీ 152 సీట్లలో ఆధిక్యం కనబరుస్తూ ప్రభంజనం సృష్టిస్తోంది. టీడీపీ 23 స్థానాల్లోనే ఆధిక్యం కనబరుస్తోంది. జనసేన ఒక్కస్థానం కూడా గెలిచే పరిస్థితి కనిపించడం లేదు.

*ఒడిషా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ 99 బీజేపీ 28 కాంగ్రెస్ 15 ఇతరులు 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు.

*తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ పుంజుకున్నాయి. బీజేపీ 4 స్థానాల్లో కాంగ్రెస్ 3 స్థానాల్లో టీఆర్ఎస్ 9 స్థానాల్లో ఆదిక్యంలో ఉంది.

*మంగళగిరిలో లోకేష్ వెనుకబడ్డారు. ఆయనపై వైసీపీ అభ్యర్థి ఆళ్ల 8964ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

*ఏపీ సీఎంగా జగన్ ఈనెల 30న ప్రమాణ స్వీకారం చేస్తారని వైసీపీ నేత ఉమ్మారెడ్డి తెలిపారు.

*నిజామాబాద్ లో కేసీఆర్ కుమార్తె కవితపై బీజేపీ అభ్యర్థి అరవింద్ 31వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

* ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన మోడీ జగన్ లకు కేసీఆర్ అభినందనలు తెలిపారు. జగన్ కు స్వయంగా ఫోన్ చేసి విషెస్ చెప్పారు.

*వైసీపీ అధినేత జగన్ కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ట్విట్టర్ లో శుభాకాంక్షలుచెప్పారు.

*ఏపీలో తొలి విజయం నమోదైంది.  విజయనగరం జిల్లా పార్వతీపురంలో వైసీపీ అభ్యర్థి జోగారావు గెలిచారు.

..................................................

ఏపీలో మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఫలితాలను చూస్తే వైసీపీ 150 సీట్లకు పైగా ఆధిక్యంలో కొనసాగుతోంది.  టీడీపీ 25 సీట్లలో ఆధిక్యంలో ఉంది.

12.10: బీజేపీ దేశంలో తొలి విజయం సాధించింది. డామన్ డయ్యూలో ఆ పార్టీ అభ్యర్థి లాలూభాయ్ పటేల్ విజయం సాధించారు.

12.11: విశాఖ ఉత్తరం నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావు వెనుకంజలో ఉన్నారు. ఆయనపై వైసీపీ అభ్యర్థి కేకే రాజు 587 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

12.12: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ లో వివాదాస్పద సాధ్వి ప్రజ్ఞాసింగ్ ముందంజలో ఉన్నారు.

12.13: పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ తగిలింది. గతంలో 2 సీట్లే సాధించిన బీజేపీ ఈ ఎన్నికల్లో 17 చోట్ల ఆధిక్యంలో ఉండడం గమనార్హం. తృణమూల్ 24 సీట్లలో ఆధిక్యంలో ఉంది.

12.14: కుప్పం లో చంద్రబాబు ఏడోరౌండ్ ముగిసేసరికి 6260ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

12.15: షోలాపూర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ మాజీ హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే వెనుకంజలో ఉన్నారు. బారామతిలో ఎన్సీపీ అభ్యర్థి సుప్రీయా సూలే ముందంజలో ఉన్నారు.

12.16: గుడివాడలో వైసీపీ అభ్యర్థి కొడాలి నాని 5380ఓట్ల ఆధిక్యంలో ఐదోరౌండ్ లో కొనసాగుతున్నారు.

12.14: మల్కాజిగిరి లోక్ సభలో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఏడో రౌండ్ లో 3781 ఓట్ల మెజార్టీతో ఉన్నారు.

12.20: భీమవరంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మూడో స్తానంలో ఉన్నారు. మూడో రౌండ్  ముగిసేసరికి వైసీపీ మొదటి స్థానంలో టీడీపీ రెండో స్థానంలో ఉంది.

12.25: హిందూపురంలో రెండో రౌండ్ ముగిసేసరికి నందమూరి బాలయ్య 3671 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు

..........................................

ఆంధ్రప్రదేశ్ లో పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ జోరు కొనసాగిస్తోంది. దాదాపు 20 లోక్ సభ స్థానాల్లో వైసీపీ ఆధిక్యంలో ఉండగా.. టీడీపీ 5 చోట్ల ముందంజలో ఉంది. ట్రిండింగ్ ను బట్టి చూస్తే వైసీపీకి 22-24 వరకు ఎంపీ సీట్లు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని.. టీడీపీ 1-3 ఎంపీ సీట్లు మాత్రమే వచ్చి ఘోర పరాజయం పొందే అవకాశఆలున్నాయని తెలుస్తోంది.

రెండో రౌండ్ పూర్తయ్యేసరికి దేశంలో బీజేపీ 312 స్థానాల్లో అఖండ మెజార్టీతో దూసుకుపోతుండగా..  కాంగ్రెస్ 110 స్థానాలతో కుదేలైంది. ఇతరులు 95 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

 11.23: కేరళ రాష్ట్రంలోని వయనాడ్ లో రాహుల్ గాంధీ లక్షకు పైగా మెజార్టీతో దూసుకెళ్తున్నారు. అమేథిలో మాత్రం రాహుల్ వెనుకడి పోయారు. ఇక్కడే సృతీ ఈరానీ ఆయనపై  4300 ఓట్ల లీడ్ లో ఉన్నారు.

11.23: తిరువనంతపురం కాంగ్రెస్ అభ్యర్థి శశిథరూర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

11.23: హైదరాబాద్ ఎంపీ సీటులో అసదుద్దీన్ ముందంజలో ఉన్నారు. 7523 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

11.24: సికింద్రాబాద్ ఎంపీ సీటులో బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి 15వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

11.24: జైపూర్ రూరల్ లో కాంగ్రెస్ అభ్యర్థి కృష్ణ పూనియా వెనుకంజలో ఉన్నారు. రాజ్యవర్ధన్ రాథోడ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

11.25: రాప్తాడ్ లో పరిటాల శ్రీరామ్ వెనుకంజ
11.26: మంగళగిరిలో మూడో రౌండ్ పూరయ్యే సరికి లోకేష్ వెనుకంజ

11.30: బీహార్ జెగుసరాయ్ నుంచి సీపీఐ అభ్యర్థి కన్హయ్య కుమార్ వెనుకంజలో ఉన్నారు.

11.30: కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి భారీ షాక్.. మొత్తం రాష్ట్రంలోని రాష్ట్రంలోని 28 లోక్ సభ స్థానాలకు బీజేపీ 23చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్-జేడీఎస్ కూటమి కేవలం ఐదుస్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది. మాండ్యాలో సుమలత 1200ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్నారు.

11.31: పశ్చిమ బెంగాల్ లో బీజేపీ తృణమూల్ పార్టీల మధ్య గట్టి పోటీ నడుస్తోంది. బెంగాల్ లో మొత్తం 42 లోక్ సభ స్థానాలకు గాను బీజేపీ 18చోట్ల తృణమూల్ 20 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

11.32: పంజాబ్ లో కాంగ్రెస్ 8 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. బీజేపీ శిరోమణి ఆకాలీదళ్ చెరో రెండు స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఆప్ 1 స్థానంలో ఆధిక్యంలో ఉంది.

11.33: ఢిల్లీ ఏడు లోక్ సభ స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది.

11.34: కర్ణాటక బీజేపీ అభ్యర్థి అనంతకుమార్ హెగ్డే ముందంజలో కొనసాగుతోంది.

11.34: గాంధీ నగర్ నుంచి అమిత్ షా 50వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

11.34: తూర్పు ఢిల్లీ నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి గౌతమ్ గంభీర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

11.35: బీహార్ రాజధాని పాట్నా సాహిబ్ కాంగ్రెస్ అభ్యర్థి శతృఘ్న సింహ వెనుకంజలో ఉన్నారు.

11.36: ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్ పూర్ లో బీజేపీ నేత కేంద్రమంత్రి సుల్తాన్ పూర్ వెనుకంజలో ఉన్నారు.

11.36:ఫిలిబిత్ లో పోటీచేసిన బీజేపీ అభ్యర్థి వరుణ్ గాంధీ దూసుకుపోతున్నారు..

11.37: యూపీలోని రాయ్ బరేలిలో సోనియాగాంధీ ముందంజలో ఉన్నారు.

11.38: ఎస్పీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ యూపీలోని మెయిన్ పూర్ లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

11.37: మాండ్యాలో ఇండిపెండెంట్ సుమలత ఆధిక్యంలో ఉండగా.. రాంపూర్ లో సినీ నటి బీజేపీ అభ్యర్థి జయప్రద వెనుకంజలో ఉన్నారు.

11.38: గురుదాస్ నగర్ నుంచి సన్నీ డియోల్ ముందంజలో ఉన్నారు.

..................................................

10.59: ఉత్తరప్రదేశ్ నియోజకవర్గంలోని మధుర నియోజకవర్గంలో ప్రముఖ నటి బీజేపీ అషభ్యర్థి హేమామాలిని వెనుకంజలో ఉన్నారు.

10.59: మెదక్ లోక్ సభ స్థానం నుంచి టీఆర్ ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి లక్ష ఓట్ల మెజార్టీతో దూసుకుపోతున్నారు.

11.00 : బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా.. గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ నియోజకవర్గంలో భారీ ఆధిక్యతతో దూసుకుపోతున్నారు. లక్షా పాతికవేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

11.00: తెలంగాణలోని మొత్తం 17 లోక్ సభ నియోజకవర్గంలో టీఆర్ ఎస్ 9 స్థానాల్లో ముందంజలో ఉండగా.. నాలుగు స్థానాల్లో బీజేపీ మూడు స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఆదిలాబాద్ నిజామాబాద్ సిక్రింద్రాబాద్ కరీంనగర్ లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. నల్గొండ చేవెళ్ల మల్కాజిగిరిలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. మిగిలిన స్తానాల్లో టీఆర్ఎస్ హవా కొనసాగుతోంది.

................................................  


ఏపీలో వైసీపీకి 130+ సీట్లు ఖాయం

ఆంధ్రప్రదేశ్ లో శాసనసభా ఎన్నికల్లో వైసీపీ జోరు కొనసాగుతోంది. దాదాపు 130కు పైగా శాసనసభా స్థానాల్లో పార్టీ ఆధిక్యంలో ఉంది. టీడీపీ సుమారు 30 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉండడం విశేషం. మంత్రులు కూడా వెనుకంజలో ఉన్నారు. దేవినేని ఉమ జవహర్ చినరాజప్ప అయ్యన్పపాత్రుడు సోమిరెడ్డి అఖిలప్రియ లోకేష్ కిడారి శ్రవణ్ నారాయణ అచ్చెన్నాయుడు జవన్ తదితరులు వెనుబడిపోయారు.

 10.34 :చంద్రబాబు సొంత జిల్లా టీడీపీ ఊహించని విధంగా చతికిలపడింది. చిత్తూరు జిల్లాలో వైసీపీ పార్టీ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 14 అసెంబ్లీ స్థానాల్లో 13 చోట్ల కొనసాగుతున్న వైసీపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పుంగనూరులో మూడోరౌండ్ ముగిసేసరికి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి ముందంజలో ఉన్నారు. తంబల్లపల్లి వైసీపీ అభ్యర్థి ద్వారాకనాథ్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సత్యవేడు నగరిలోనూ వైసీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.

10.34: విశాఖ జిల్లా నర్సీపట్నంలో మంత్రి అయ్యన్నపాత్రుడు వెనుకంజలో ఉన్నారు.

10.35: కృష్ణ జిల్లా గుడివాడలో వైసీపీ అభ్యర్థి కొడాలి నాని.. టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ పై 2600ఓట్ల తేడాతో ఆధిక్యంలో నిలిచారు.

10.35: ఉదయగిరిలో వైసీపీ అభ్యర్థి మేకపాటి శేఖర్ రెడ్డి రెండో రౌండ్ ముగిసేసరికి 3953 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

10.36: విజయనగరం నెల్లూరు జిల్లాల్లోని అన్ని స్థానాల్లో వైసీపీ ఆధిక్యంలో ఉంది. శ్రీకాకుళంలో 9 స్థానాల్లో ముందంజంలో ఉంది.

10.36: మాండ్యా లోక్ సభ స్థానం నుంచి పోటీచేసిన స్వతంత్ర అభ్యర్థి సుమలత మూడోరౌండ్ లోనూ ముందంజలో ఉన్నారు.

10.37: కేంద్రమంత్రి బీజేపీ జైపూర్ రూరల్ అభ్యర్థి రాజ్యవర్ధన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.


...............................

అనూహ్యం.. తెలంగాణలో బీజేపీ ఆధిక్యత

తెలంగాణలో కారు.. సర్కారు.. పదహారు అని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. అసెంబ్లీలో మెజార్టీ సీట్లు ఇచ్చిన టీఆర్ఎస్ ను గద్దెనెక్కించిన తెలంగాణ ప్రజలు.. పార్లమెంట్ నియోజకవర్గాల వరకు వచ్చేసరికి జాతీయ కోణంలోనే చూశారని అర్థమవుతోంది. అందుకే తెలంగాణలో కుదేలైన కాంగ్రెస్ ను కాదని.. జాతీయ పార్టీ బీజేపీ వైపు తెలంగాణలో మొగ్గు చూపారు.

తెలంగాణలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దారుణంగా దెబ్బతింది. మొత్తం 118 నియోజకవర్గాల్లో పోటీచేస్తే 103 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. కేవలం గోషామహల్ నుంచి  రాజాసింగ్ మాత్రమే బీజేపీ నుంచి గెలిచారు.

ఇక తాజాగా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నాలుగు ఎంపీ సీట్లలో తొలి రౌండ్ లో ఆధిక్యత కనబరచడం సంచలనంగా మారింది. అస్సలు సోదిలోనే ఉండదనుకున్న బీజేపీ ఏకంగా నిజామాబాద్ లో కేసీఆర్ కుమార్తె కవితపై తొలిరౌండ్ లో ఆధిక్యత చూపడం.. కరీంనగర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ పై బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ 14 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతుండడం విశేషం. ఇక ఆదిలాబాద్ సికింద్రాబాద్ లో బీజేపీ అభ్యర్థులు తొలి రౌండ్ ఆధిక్యత సాధించడం విశేషంగా చెప్పవచ్చు

తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్మాయంగా బీజేపీని ప్రజలు చూస్తున్నారని అర్తమవుతోంది. ఈ పార్లమెంట్ ఎన్నికల వేల ప్రజలు టీఆర్ఎస్ కంటేకూడా జాతీయ కోణంలోనే చూసి ఓటేశారని అర్థమవుతోంది. దీన్ని బట్టి టీఆర్ఎస్ కు తెలంగాణలో ప్రతిపక్షంగా బీజేపీ ఎదుగుతుందని అర్థం చేసుకోవచ్చు.


.............................................

అటు బీజేపీ.. ఇటు వైసీపీ హవా..
 
ఏపీలో వైసీపీ హవా కొనసాగుతోంది. తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీ పోటీనిస్తోంది. నిజామాబాద్ లో తొలి రౌండ్ లో కేసీఆర్ కూతురు కవిత వెనుకబడడం సంచలనంగా మారింది. కరీంనగర్ లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ముందంజలో ఉన్నారు. సికింద్రాబాద్ ఆదిలాబాద్ లలో కూడా తొలిరౌండ్లో బీజేపీ ముందంజలో ఉండడం విశేషం.

10.19: మంగళగిరిలో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి నారాలోకేష్ పై 1010 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు.

10.20: గుడివాడ నియోజకవర్గంలో వైసీపీ నేత కొడాలి నాని ముందంజంలో ఉన్నారు.

10.21: ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరరావు వెనుకంజలో ఉన్నారు. ఆయనపై టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు ఆధిక్యంలో నిలిచారు.

10.21: ఏపీ అసెంబ్లీ తొలి రౌండ్ లో మంత్రులు వెనుకంజలో ఉన్నారు. నారాయణ అచ్చెన్నాయుడు సోమిరెడ్డి వెనుకంజలో ఉన్నారు.

10.21: కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ సికింద్రాబాద్ లో బీజేపీ అభ్యర్థులు.. టీఆర్ఎస్ అభ్యర్థులపై లీడ్లో ఉండడం ఆసక్తిరేపుతోంది. నిజామాబాద్ లో కవిత కరీంనగర్ లో వినోద్ ఆదిలాబాద్ సికింద్రాబాద్ లో కిషన్ లో ముందంజలో ఉండడం విశేషంగా చెప్పవచ్చు.

.................................................

ఏపీలో వైసీపీ హవా స్పష్టంగా కొనసాగుతోంది. టీడీపీ బలంగా ఉండే గోదావరి జిల్లాలోనూ వైసీపీ దూసుకుపోతుండడం విశేషం. పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ ఆధిక్యం స్పష్టంగా కొనసాగుతోంది.

9.55: బిగ్ బ్రేకింగ్: గుంటూరు జిల్లా మంగళగిరిలో నారాలోకేష్ వెనుకబడ్డారు. నారాలోకేష్ పై 790ఓట్ల ఆధిక్యంలో  వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణ రెడ్డి ముందంజలో ఉన్నారు.

9.57: అనంతపురం జిల్లా రాప్తాడులో మంత్రి పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్ వెనుకంజలో ఉన్నారు. ఆయనపై వైసీపీ అభ్యర్థి ప్రకాష్ రెడ్డి ముందంజలో ఉన్నారు.

9.57: అనంతపురం అర్బన్ లో వైసీపీ అభ్యర్థి అనంత వెంకట్రామ్ రెడ్డి 1000ఓట్ల ఆధిక్యంలో టీడీపీ అభ్యర్థిపై ఉన్నారు.

9.58: ఉరవకొండలో సిట్టింగ్ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి ముందంజలో ఉన్నారు.

9.59: విజయవాడ సెంట్రల్ లో వైసీపీ అభ్యర్థి మల్లాది విష్ణు ఆధిక్యంలో కొనసాగుతున్నారు

9.59: పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ హవా కొనసాగుతోంది. ఈ జిల్లాలో 12 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. భీమవరంలో పవన్ పై వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ 625 ఓట్ల మెజార్టీ సాధించారు. తణుకులో వైసీపీ అభ్యర్థి నాగేశ్వరరావు 500ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. పోలవరంలో వైసీపీ అభ్యర్థి బాలరాజు 3241 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.


........................................................

లైవ్ అప్ డేట్స్.. తెలంగాణలో బీజేపీ 3 చోట్ల ఆధిక్యం

తెలంగాణలో టీఆర్ ఎస్ హవా కొనసాగుతోంది. అన్ని లోక్ సభ స్థానాల్లో టీఆర్ ఎస్ ముందంజలో ఉంది. కరీంనగర్ లోక్ సభ స్థానంలో పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ముందంజలో ఉన్నారు. ఆదిలాబాద్ కరీంనగర్ సికింద్రాబాద్లో బీజేపీ ముందంజలో ఉంది. టీఆర్ ఎస్ 12 చోట్ల మాత్రమే ఆధిక్యంలో ఉంది.

9.34: కరీంనగర్ లోక్ సభలో 14వేల ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి బండిసంజయ్ ముందంజలో ఉండడం విశేషం.
9.34: ఆదిలాబాద్ లోనూ బీజేపీ ఎంపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు
9.34: సికింద్రాబాద్ లోనూ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి స్వల్ప ఆధిక్యంలో ఉన్ానరు.
9.35: మహబూబాద్ టీఆర్ఎస్ 10వేల ఆధిక్యంలో ఉంది.
 
9.35: అనంతపురం జిల్లా హిందూపురంలో సినీనటుడు టీడీపీ నేత నందమూరి బాలక్రిష్ణ ముందంజలో నిలిచారు.

9.38: కడప బద్వేలు రాయచోటీ ప్రొద్దటూరు మైదకూరు పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది.

9.39: ఆళ్లగడ్డలో వైసీపీ ఆధిక్యం

9.40 మంత్రాలయం బనగానపల్లి మినహా  కర్నూలు జిల్లాలో 12 చోట్ల స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతోంది.

9.41: చిత్తూరు జిల్లా నగరిలో వైసీపీ అభ్యర్థి రోజా 1221 ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్నారు.

9.42: మడకశిరలో వైసీపీ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతోంది.

9.43: భీమిలిలో టీడీపీ ఆధిక్యం..

......................................


లైవ్ అప్ డేట్స్.. చంద్రబాబు వెనుకంజ

ఏపీలో ఉదయం 9.30 వరకు పోలింగ్ ట్రెండ్ ను బట్టి  చూస్తే ఏపీలో వైసీపీ 82 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. టీడీపీ కేవలం 21 స్థానాల్లోనే ముందంజలో ఉంది.

*బిగ్ బ్రేకింగ్: కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు తొలి రౌండ్ లో వెనుకంజలో ఉండడం సంచలనంగా మారింది. కేవలం 67 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థి స్వల్ప ఆధిక్యత సాధించడం సంచలనంగా మారింది.

*9.30: దెందలూరులో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వెనుకంజలో ఉన్నారు.
9.30 : మంగళగరిలో మాత్రం లోకేష్ ముందంజలోనే కొనసాగుతున్నారు.

*9.30: ఏలూరులో వైసీపీ ఆధిక్యంలో కోనసాగుతోంది.

9.31:సర్వేపల్లిలో టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెనుకంజలో ఉన్నారు.

..........................................

ఏపీలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉదయం 9.25 వరకు  ట్రెండ్స్ ను బట్టి చూస్తే ఏపీలో ప్రతిపక్ష వైసీపీ ఆధిక్యం సంపూర్ణంగా కొనసాగుతోంది. కడపలో పది స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ వైసీపీ క్లీన్ స్వీప్ దిశగా దూసుకుపోతోంది. ఇక కోస్తాంధ్రాలో జనసేన ఓట్లు భారీగా చీల్చింది. ఈ ఓట్ల ప్రభావం టీడీపీపై పడింది. టీడీపీని జనసేన చావుదెబ్బ తీసినట్టు అర్థమవుతోంది.

*భీమవరంలో పవన్ వెనుకంజ.. మొదటరి 625 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు.

* 9.15: నెల్లూరు సిటీలో మంత్రి నారాయణ వెనుకబడ్డారు. వైసీపీ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

9.20: చిత్తూరు జిల్లా నగరిలో వైసీపీ అభ్యర్థి ఆర్కే రోజా ముందంజలో ఉన్నారు.

9.21: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో మంత్రి కళా వెంకట్రావ్ వెనుకంజలో నిలిచారు.

9.25: గుంటూరు ఈస్ట్ వెస్ట్ లో టీడీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది.

9.26: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ భీమవరంతోపాటు గాజువాకలో కూడా వెనుకంజలో కొనసాగుతుండడం సంచలనంగా మారింది.

.......................................

ఇండియా లైవ్ అప్ డేట్స్.. ఆధిక్యం వీరిదే..

9.15: ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలి నియోజకవర్గంలో పోటీచేసిన యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ ముందంజలో ఉన్నారు.

9.16: ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి ప్రముఖ నటి జయప్రద వెనుకంజలో ఉన్నారు.

9.17: కర్ణాటకలోని మాండ్య నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి సినీ నటి సుమలత ముందంజలో ఉన్నారు.

.................................................


దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ హవా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా మొత్తం 542 లోక్ సభ స్థానాల్లో బీజేపీ 235 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ 114 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక ఎస్పీ-బీఎస్పీ 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఇతరులు 92 స్థానాల్లో లీడ్ లో ఉన్నారు.

9.05: బ్రేకింగ్ న్యూస్ .. యూపీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీచేసిన అమేథి నియోజకవర్గంలో ఆయనపై పోటీచేసిన సృతీ ఈరానీ ముందంజలో ఉండడం సంచలనంగా మారింది.

9.06: కాంగ్రెస్ పార్లమెంట్ పక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే కలబురిగి నియోజకవర్గం నుంచి పోటీచేశారు. ఆయన వెనుకంజలో ఉన్నారు.

9.07: ముంబై ఉత్తరం నుంచి పోటీచేసిన కాంగ్రెస్ అభ్యర్థి నటి ఉర్మిళ మంటోడ్కర్ వెనుకంజలో ఉన్నారు.

9.08: మధ్యప్రదేశ్ లోని చింద్వారాలో కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

9.08: మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ .. భోపాల్ నియోజకవర్గంలో వెనుకబడి పోయారు.

9.09: మధ్యప్రదేశ్ లోని గుణ నియోజకవర్గంలో కాంగ్రెస్ యువనేత జ్యోతిరాదిత్య సింధియా వెనుకంజలో ఉన్నారు.

9.10: వారణాసిలో నరేంద్రమోడీ ముందంజలో ఉన్నారు.  తొలి రౌండ్ లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

..................................................


ఏపీలో ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను పోలింగ్ సిబ్బంది లెక్కించారు. చాలా చోట్ల వైసీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. టీడీపీ పోస్టల్ బ్యాలెట్లలో వెనుకబడింది. ఏపీలో మొత్తం 503199 పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు పోలయ్యాయి.

* 8.55: గుంటూరు జిల్లా మంగళగిరిలో నారాలోకేష్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

8.55: కడప జిల్లా పులివెందులలో వైసీపీ అధినేత ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

8.55: నెల్లూరు సిటీలో వైసీపీ అభ్యర్థి అనిల్కుమార్ యాదవ్ ముందంజలో ఉన్నారు.

8.55: శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో టీడీపీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు వెనుకంజలో ఉన్నారు

8.54: శ్రీకాకుళం జిల్లా చీపురుపల్లిలో వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఆధిక్యంలో ఉన్నారు.

*8.54: కడపలో లోక్ సభ స్థానం నుంచి పోటీచేసిన వైసీపీ అభ్యర్థి అవినాష్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

8.53: తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో వైసీపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు.

8.52: ఎర్రగొండపాలెంలో వైసీపీ అభ్యర్థి సురేష్ ఆధిక్యంలో నిలిచారు.

8.52: తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో వైసీపీ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

8.51: అనంతపురం రూరల్ శింగనమల నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.

..........................................లైప్ అప్ డేట్స్ ప్రకారం..
*దేశంలో.. ఉదయం 8.50 గంటల వరకు దేశవ్యాప్తంగా బీజేపీ పోస్టల్ బ్యాలెట్ లో సత్తా చాటింది. మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న 542 లోక్ సభ స్థానాల్లో బీజేపీ 162 లోక్ సభ సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఇక కాంగ్రెస్ యూపీఏ పక్షాలు 63 స్థానాల్లో మాత్రమే ఆధిక్యతను చాటాయి. ఎస్పీ 2 చోట్ల ఇతరులు 41 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. మొత్తంగా పోస్టల్ బ్యాలెట్ నుంచే బీజేపీ హవా కొనసాగుతోంది.

*తెలంగాణలో
తెలంగాణలో పోస్టల్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8.50 గంటల వరకు 7 చోట్ల పోస్టల్ బ్యాలెట్లలో టీఆర్ ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ ఖాతా తెరువలేదు.

*ఆంధ్రప్రదేశ్ లో
హోరాహోరీగా సాగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లను 8.50 గంటల వరకు చూస్తే టీడీపీ 2 చోట్ల లీడ్ లో ఉండగా.. వైసీపీ 6 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది.

............................................


దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైంది. ఎప్పుడూ లేనంతగా ఈసారి ఓట్ల లెక్కింపు ఉత్కంఠ రేపుతోంది. ఈ ఎన్నికల సమరంలో హోరాహోరీగా తలపడిన అన్ని రాజకీయ పక్షాలు ఇప్పుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. దేశంలో ప్రధానంగా పోటీ బీజేపీ యూపీఏ పోటీపడగా.. ఏపీలో టీడీపీ వైసీపీ జనసేన ప్రధానంగా పోటీపడ్డాయి.