బాలకృష్ణపై పోటీకి దిగుతున్న టీవీ యాంకర్

Tue Jan 22 2019 19:28:58 GMT+0530 (IST)

మీరు చదివింది నిజమే.. రాబోయే ఎన్నికల్లో హిందూపూర్ నియోజకవర్గం నుంచి నందమూరి బాలకృష్ణపై ఓ టీవీ యాంకర్ పోటీ చేయబోతోంది. ఆమె పేరు శ్వేతా రెడ్డి. గతంలో పలు టీవీ ఛానెళ్లలో యాంకరింగ్ చేసిన ఈ అమ్మాయిని తన పార్టీలో తీసుకున్నారు కేఏ పాల్. ప్రజాశాంతి పార్టీపై రాబోయే ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గం నుంచి ఈమె పోటీచేయబోతోంది.తన పార్టీ కేవలం  ఏ ఒక్క కులానికో చెందినది కాదని అందుకే రెడ్డి వర్గానికి చెందిన శ్వేతాకు టిక్కెట్ ఇచ్చానని ప్రకటించారు కేఏపాల్. ప్రస్తుతం ప్రజాశాంతి పార్టీ కోసం 44వేల మంది కో-ఆర్డినేటర్లు పనిచేస్తున్నారని.. వాళ్లంతా రాబోయే రోజుల్లో 2 కోట్ల మందిని తమ పార్టీలోకి చేరుస్తారని అంటున్నారు పాల్.

కేవలం శ్వేతారెడ్డి మాత్రమే కాకుండా.. కాపు - యాదవ - మాల - మాదిగ కులస్తులందరికీ టిక్కెట్లు ఇస్తామని ప్రకటించారు కేఏ పాల్. తను తలుచుకుంటే విదేశాలకు వెళ్లి లక్ష కోట్లు తెస్తానని - ఒక్కో నియోజకవర్గం అభివృద్ధికి వంద కోట్లు తేగలనని అంటున్నారు పాల్. మొదట్లో కేఏ పాల్ ఇంటర్వ్యూల కోసం క్యూ కట్టిన ఛానెళ్లు ప్రస్తుతం ఆయన్ను చూపించడం మానేశాయి. స్టుడియోలకు పిలవడం తగ్గించేశాయి. దీని వెనక చంద్రబాబు కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు పాల్.