Begin typing your search above and press return to search.

జ‌గ‌న్‌ తో దోస్తీపై షా చెప్పింది ఇదే!!

By:  Tupaki Desk   |   27 Aug 2017 10:13 AM GMT
జ‌గ‌న్‌ తో దోస్తీపై షా చెప్పింది ఇదే!!
X
రాష్ట్రంలో ప్ర‌ధాన విప‌క్షంగా ఉంటూ.. అడుగ‌డుగునా అధికార ప‌క్షం టీడీపీ వైఫ‌ల్యాల‌ను ఎత్తి చూపుతూ.. ప్ర‌శ్నిస్తున్న వైసీపీని బ‌ద్నాం చేసేందుకు ముఖ్యంగా వైసీపీ వెంటే ఉంటున్న ముస్లిం వ‌ర్గాల్లో వైసీపీని దూరం చేసేందుకు రాష్ట్రంలోని ఎల్లో మీడియా ఇటీవ‌ల‌కాలంలో తీవ్ర ప్ర‌య‌త్నాలు చేసింది. ముఖ్యంగా నంద్యాల ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీకి అండ‌గా నిలిచిన ముస్లింల‌ను పార్టీ నుంచి దూరం చేసేందుకు.. ప‌న్నిన ప‌న్నాగాలు అన్నీ ఇన్నీకావు. మోకాలికి, బోడిగుండుకూ ముడిపెడుతూ.. `జ‌గ‌న్‌-బీజేపీ భాయి భాయి` - వంటి శీర్షిక‌ల‌తో క‌థ‌నాల‌ను వండి వార్చాయి.

ఎలాగైనా స‌రే ముస్లిం వ‌ర్గాన్ని జ‌గ‌న్‌ కి దూరం చేయాల‌నే కుట్ర‌తో చేసిన ఈ ప్ర‌య‌త్నాల‌ను అంద‌రూ చీద‌రించుకున్నారు కూడా. ఇక‌, ఇప్పుడు నేరుగా బీజేపీ సార‌ధి అమిత్ షానే స్వ‌యంగా స్పందించారు. త‌మ‌కు వైసీపీతో సంబంధాలు లేవ‌ని ఆయ‌న కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. అంతేకాదు, కొత్త పొత్తులు త‌మ‌కు అవ‌స‌రం లేద‌ని కూడా షా స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టికే తాము ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకున్నామ‌ని, అధికారంలోకి కూడా వ‌చ్చామ‌ని, మంత్రి ప‌ద‌వులు సైతం ఉన్నాయ‌ని, ఈ క్ర‌మంలో అధికారంలో లేని వ్య‌క్తితో ఎలా అంట‌కాగుతామ‌ని ఆయ‌న ఒక రేంజ్‌ లో ఈ విష‌యంపై ఆగ్ర‌హం కూడా వ్య‌క్తం చేసిన‌ట్టు స‌మాచారం.

ఇక ఇదే విష‌యంపై స్థానిక బీజేపీ సీనియ‌ర్లు కూడా క్లారిటీ ఇస్తున్నారు. త‌మ పొత్తు.. టీడీపీతోనే ఉంటుంద‌ని, కొత్త‌గా ఎవ‌రితోనూ అంట‌కాగాల్సిన అవ‌స‌రం లేద‌ని పురందేశ్వ‌రి వంటి సీనియ‌ర్లు వెల్ల‌డించారు. అదేస‌మ‌యంలో వైసీపీకి మ‌ద్ద‌తుపైనా మాట్లాడుతూ..అది లేద‌ని చెప్పారు. కానీ, ఎల్లో మీడియా మాత్రం ఎప్ప‌టిక‌ప్పుడు జ‌గ‌న్‌ ను బ‌ద్నాం చేసే ప్ర‌య‌త్నాల‌కు పాల్ప‌డుతూనే ఉంద‌నేది నిజం. నంద్యాలలో టీడీపీని గెలిపించ‌డ‌మే అజెండాగా పెట్టుకున్న ఎల్లో మీడియా.. బాబుకు వంత‌పాడ‌డం మానేసి.. కోడిగుడ్డుమీద ఈక‌లు పీకే ప‌ని పెట్టుకుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి షా.. ఇచ్చిన షాక్‌ తోనైనా ఎల్లో మీడియా మారుతుందో లేదో చూడాలి.