Begin typing your search above and press return to search.

వెస్టిన్ హోట‌ల్లో ఇవాంక క‌మాండ్ పోస్ట్‌

By:  Tupaki Desk   |   23 Nov 2017 4:37 AM GMT
వెస్టిన్ హోట‌ల్లో ఇవాంక క‌మాండ్ పోస్ట్‌
X
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక హైదరాబాద్ ప‌ర్య‌ట‌న ద‌గ్గ‌ర‌కు వ‌స్తోంది. దీంతో ఆమెకు భ‌ద్ర‌త క‌ల్పించేందుకు క‌నివిని ఎరుగ‌ని రీతిలో భ‌ద్ర‌తా ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఇవి ఎంత‌లా ఉన్నాయంటే.. ఇవాంకా భ‌ద్ర‌త కోసం నాసా ప్ర‌త్యేకంగా ప్ర‌యోగించిన ఒక శాటిలైట్‌.. హైద‌రాబాద్ పై డేగ క‌న్ను వేసింది.

మ‌రీ ముఖ్యంగా ఇవాంక బ‌స చేసే వెస్టిన్ హోట‌ల్ తో పాటు.. ఆమె పాల్గొనే బిజినెస్ స‌మ్మిట్ తో పాటు.. విందుకు హాజ‌ర‌య్యే ఫ‌ల‌క్ నుమా ప్యాలెస్ తో పాటు కీల‌క‌మైన ప్రాంతాల‌పై శాటిలైట్ దృష్టి పెట్టింది. శాటిలైట్‌ కుండే హైఎండ్ రెజుల్యూష‌న్ కెమేరాలు అనుక్ష‌ణం త‌మ‌కు నిర్దేశించిన ల‌క్ష్యంపై క‌న్నేసి ఉంచుతాయి.

ఎప్ప‌టిక‌ప్ప‌డు తాను తీసిన చిత్రాన్ని పంపిస్తుంది. వీటిని విశ్లేషించేందుకు వీలుగా ఇవాంకా బ‌స చేసే వెస్టిన్ హోట‌ల్లో ప్ర‌త్యేకంగా ఒక క‌మాండ్ పోస్ట్ ను ఏర్పాటు చేశారు. ఇవాంకాకు భ‌ద్ర‌త‌ను క‌ల్పించే అధికారుల బృందం శాటిలైట్ పంపించే ఛాయాచిత్రాల్ని ఎప్ప‌టిక‌ప్పుడు విశ్లేషించ‌నున్నారు. ఇవాంకా పాల్గొనే స‌ద‌స్సుకు ప్ర‌ధాని మోడీ కూడా రానున్న నేప‌థ్యంలో అమెరికా సీక్రెట్ స‌ర్వీస్ తో పాటు ప్ర‌ధాని భ‌ద్ర‌త‌ను ప‌ర్య‌వేక్షించే స్పెష‌ల్ ప్రొటెక్ష‌న్ గ్రూపు క‌లిసి భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షించ‌నున్నారు.

ఇవాంక బ‌స చేసే వెస్టిన్ హోట‌ల్లో ఆమె ఉండే అంత‌స్తు పైన రెండు..కింద రెండు అంత‌స్తుల్ని అమెరికా నిఘా వ్య‌వ‌స్త తమ అధీనంలోకి తెచ్చుకుంది లిఫ్ట్ మార్గాన్ని.. మెట్ల మార్గాన్ని వారు తీసేసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. ఇవాంక పాల్గొనే హెచ్ ఐసీసీ.. తాజ్ ఫ‌ల‌క్ నుమ ప్యాలెస్ కార్య‌క్ర‌మాలు ఖ‌రార‌య్యాయి. ఆమె వెళ‌తార‌ని చెబుతున్నచార్మినార్‌.. గోల్కొండ ప్రాంతాల‌పై హోంల్యాండ్ సెక్యూరిటీ నుంచి ఇంకా క్లియ‌రెన్స్ రాలేద‌ని చెబుతున్నారు.

మ‌రోవైపు ఇవాంక హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో వినియోగించేందుకు ప్ర‌త్యేకంగా నాలుగు వాహ‌నాల‌ను సీక్రెట్ స‌ర్వీస్ ఏజెంట్లు హైద‌రాబాద్ తీసుకొచ్చారు. ఆమె ప్ర‌యాణించే ప్ర‌త్యేక కారు.. క‌మ్యూనికేష‌న్.. నిఘా.. త‌దిత‌ర ఎల‌క్ట్రానిక్ ఉప‌క‌ర‌ణాల‌తో మ‌రో వాహ‌నం సిటీకి చేరుకున్నాయి. ఇవాంక వాహ‌నం వెనుక ఉండే ఫ‌స్ట్ ఎస్కార్ట్‌.. సెకండ్ ఎస్కార్ట్ వాహ‌నాల‌ను ఢిల్లీలోని అమెరికా రాయ‌బార కార్యాల‌యం నుంచి తీసుకొచ్చారు. ప్ర‌స్తుతం నాలుగు వాహ‌నాల్ని ర‌హ‌స్య ప్రాంతంలో దాచి ఉంచిన‌ట్లుగా తెలుస్తోంది.

హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో ఇవాంక ఉప‌యోగించే కార్లు కేవ‌లం మైన్ ఫ్రూప్ మాత్ర‌మే కాద‌ని.. అణుధార్మిక‌త ఉన్న ఆయుధాల దాడుల్ని త‌ట్టుకోవ‌టం వీటి ప్ర‌త్యేక‌త‌గా చెబుతున్నారు. అంతే కాదు.. ఈ వాహ‌నంతో చిన్న‌స్థాయి యుద్ధాన్ని పూర్తి చేసే స‌త్తా వీటి సొంతంగా చెబుతున్నారు.

ఇవాంక‌కు ర‌క్ష‌ణ క‌ల్పించేందుకు వీలుగా ఆమె వెంట ఉండే సెక్యూరిటీ బృందం అత్యాధునిక ఆయుధాల్ని తీసుకొచ్చేందుకు వీలుగా ద‌ర‌ఖాస్తు చేసుకుంది. ఇప్ప‌టికి 11 ర‌కాలైన ఆయుధాల‌ను తీసుకురావ‌టానికి వీలుగా ప‌ర్మిష‌న్లు పొందింది. ఇవాంకకు ర‌క్ష‌ణ క‌ల్పించే బృందం వాడే ఆయుధాల్లో పిస్ట‌ల్స్‌.. స‌బ్ మెషీన్ గ‌న్స్‌.. స్నైప‌ర్ రైఫిల్స్ కూడా ఉన్న‌ట్లు చెబుతున్నారు.