Begin typing your search above and press return to search.

పౌరుల చేతుల్లో ఉన్న తుపాకుల లెక్క తెలిస్తే!

By:  Tupaki Desk   |   21 Jun 2018 1:30 AM GMT
పౌరుల చేతుల్లో ఉన్న తుపాకుల లెక్క తెలిస్తే!
X
ప్రాణం తీసే మ‌నిషి.. పోయిన ప్రాణాన్ని వెన‌క్కి తీసుకురాలేడు. అయిన‌ప్ప‌టికీ మ‌నిషిని చంపే దుర్మార్గం మ‌న‌సున్న మ‌నిషికే సాధ్యం. నిత్యం అసంతృప్తితో ర‌గిలిపోయే మ‌నిషి.. త‌న ర‌క్ష‌ణ కోసం.. త‌న ర‌క్ష‌ణ‌కు భంగం వాటిల్లితుంద‌న్న భావ‌న క‌లిగినా ఆయుధాన్ని ప్ర‌యోగించ‌టం తెలిసిందే.

అవ‌స‌రం ఉన్నా లేకున్నా ఆయుధాన్ని ఉంచుకునే తీరు అమెరికాలో ఎక్కువ‌న్న మాట వినిపిస్తూ ఉంటుంది. తాజాగా ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తుపాకీలు ఎన్ని అంశంపై ఒక ఆస‌క్తిక‌ర అధ్య‌య‌నం చేప‌ట్టారు. స్మాల్ ఆర్మ్స్ పేరుతో చేప‌ట్టిన ఈ అధ్య‌య‌నం షాకింగ్ అంశాల్ని బ‌య‌ట‌పెట్టింది.

ప్ర‌పంచ వ్యాప్తంగా వంద కోట్ల‌కు పైగా తుపాకీలు ఉన్న‌ట్లుగా తేల్చారు. ఇందులో 85.7 కోట్ల తుపాకీలు పౌరుల చేతుల్లో ఉన్న‌ట్లుగా ఆ అధ్య‌య‌నం తేల్చింది. ఆయుధాలున్న పౌరుల్లో 46 శాతం అమెరిక‌న్లు కాగా.. ఆ త‌ర్వాతి స్థానంలో భార‌త్ ఉండ‌టం ఆందోళ‌న క‌లిగించే అంశంగా చెప్ప‌క త‌ప్ప‌దు.

అమెరికాలోని పౌరుల వ‌ద్ద 39.3 కోట్ల తుపాకీలు ఉన్నాయ‌ని.. భార‌త్ పౌరుల ద‌గ్గ‌ర 7.1 కోట్ల ఆయుధాలు ఉన్న‌ట్లుగా ఈ అధ్య‌య‌నం లెక్క క‌ట్టింది. చైనా ద‌గ్గ‌ర 4.97 కోట్లు.. పాకిస్థాన్ ద‌గ్గ‌ర 4.39 కోట్ల తుపాకీలు ఉన్నాయ‌ని.. ఆ త‌ర్వాతి స్థానంలో ర‌ష్యా ఉన్న‌ట్లుగా లెక్క తేల్చారు. తాజా అధ్య‌య‌నంలో అధికారిక ఆయుధాల‌తో పాటు అన‌ధికారిక ఆయుధాల్ని కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న‌ట్లుగా చెబుతున్నారు.

అమెరిక‌న్లు ఏటా స‌గ‌టున 1.4 కోట్ల తుపాకీలు కొంటున్న‌ట్లుగా చెబుతున్నారు. ఆ దేశంలో నివ‌సించే ప్ర‌తి వంద‌మందికి 121 తుపాకీలు ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా వివిధ దేశాల సైన్యాల ద‌గ్గ 13.3 కోట్ల తుపాకీలు ఉంటే.. భ‌ద్ర‌తా సంస్థ ద‌గ్గ‌ర 2.27 కోట్ల తుపాకీలు ఉన్న‌ట్లుగా చెప్పారు. సైన్య‌ప‌రంగా అత్య‌ధిక ఆయుధాలు ఉన్న దేశాల్ని చూస్తే.. ర‌ష్యా.. చైనా.. ఉత్త‌ర కొరియా.. ఉక్రెయిన్.. అమెరికాలు నిల‌వ‌గా.. భ‌ద్ర‌త సంస్థ‌ల వ‌ద్ద ఉన్న ఆయుధాల జాబితాలో ర‌ష్యా.. చైనా.. భార‌త్‌.. ఈజిప్ట్‌.. అమెరికాలు నిలిచాయి. భ‌ద్ర‌త‌నుకాపాడాల్సిన వ్య‌వ‌స్థ‌ల ద‌గ్గ‌ర భారీగా ఉండాల్సిన ఆయుధాలు పౌరుల ద‌గ్గ‌ర ఉండ‌టం ఆందోళ‌న క‌లిగించే అంశంగా చెప్ప‌క త‌ప్ప‌దు.