Begin typing your search above and press return to search.

భార‌త్ కు మ‌రో షాకివ్వ‌నున్న అమెరికా?

By:  Tupaki Desk   |   18 Oct 2018 6:08 PM GMT
భార‌త్ కు మ‌రో షాకివ్వ‌నున్న అమెరికా?
X
కొద్ది రోజులుగా డాల‌ర్ తో రూపాయి మార‌కం విలువ ప‌త‌న‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. ఓ పక్క రూపాయి ప‌త‌నం....మ‌రోప‌క్క అంత‌ర్జాతీయంగా ముడి చ‌మురు ధ‌ర‌ల పెరుగుద‌ల‌....వంటి కార‌ణాల‌తో భార‌తీయ షేర్ మార్కెట్ అత‌లాకుత‌ల‌మ‌వుతోంది. దీంతో, కొంత‌మంది మ‌దుప‌ర్లు త‌మ పెట్టుబ‌డుల‌ను వెన‌క్కు తీసుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. డాలరుతో రూపాయి మారకం విలువ త‌గ్గ‌డంతోపాటు మ‌రికొన్ని కార‌ణాల వ‌ల్ల భార‌త్ కు ఓ కొత్త చిక్కు వ‌చ్చిప‌డే అవ‌కాశ‌ముందని అమెరికా హెచ్చ‌రించింది. త‌మ క‌రెన్సీ మానిట‌రింగ్ లిస్ట్ నుంచి భార‌త్ ను తొల‌గించే అవ‌కాశ‌ముంద‌ని యూఎస్ ఏ ట్రెజ‌రీ డిపార్ట్ మెంట్ తెలిపింది. విదేశీ మార‌క ద్రవ్యం విష‌యంలోగ‌త ఆరునెలల‌లో భార‌త్ లో వ‌స్తోన్న మార్పులే ఇందుకు కార‌ణ‌మ‌ని తెలిపింది.

ఈ ఏడాది ఏప్రిల్ లో భార‌త్ తో పాటు చైనా - జ‌ర్మ‌నీ - జ‌పాన్ - ద‌క్షిణ కొరియా - స్విట్జ‌ర్లాండ్ ల‌ను యూఎస్ ఏ క‌రెన్సీ మానిట‌రింగ్ లిస్ట్ లో చేర్చారు. ఆ జాబితాలో భార‌త్ కు చోటు ద‌క్క‌డం అదే తొలిసారి. అయితే, బుధ‌వారం నాడు తాజాగా విడుద‌ల చేసిన జాబితాలో కూడా భార‌త్ పేరు ఉంది. కానీ, గ‌త ఆరునెల‌ల్లో విదేశీ మార‌క ద్రవ్యం విష‌యంలో గ‌త ఆరునెలల‌లో భార‌త్ లో వ‌స్తోన్న మార్పుల వ‌ల్ల ఆ జాబితాలో నుంచి భార‌త్ పేరు తొలగించాల్సి ఉంటుంద‌ని యూఎస్ ఏ ట్రెజ‌రీ డిపార్ట్ మెంట్ హెచ్చ‌రించింది. గ‌త ఆరు నెల‌ల కాలంలో ఫారెన్ ఎక్సేంజ్ నెట్ సేల్స్ ...4 బిలియ‌న్ డాల‌ర్ల‌కు ప‌డిపోయింద‌ని ఆ శాఖ తెలిపింది. మ‌రో ఆరు నెల‌ల్లో రాబోయే త‌దుప‌రి అర్ధ వార్షిక జాబితా నాటికి భార‌త్ ఆ సేల్స్ పెంచాల‌ని, లేని ప‌క్షంలో ఆ జాబితా నుంచి భార‌త్ ను తొల‌గించే అవ‌కాశ‌ముంద‌ని ట్రెజ‌రీ డిపార్ట్ మెంట్ హెచ్చ‌రించింది.