Begin typing your search above and press return to search.

వంగ‌వీటి ఫ్యామిలీకి అన్యాయం జ‌ర‌గ‌దు!

By:  Tupaki Desk   |   18 Sep 2018 1:24 PM GMT
వంగ‌వీటి ఫ్యామిలీకి అన్యాయం జ‌ర‌గ‌దు!
X
గ‌డిచిన రెండు రోజులుగా బెజ‌వాడ రాజ‌కీయాల్ని హాట్ హాట్ గా మార్చేసిన వంగ‌వీటి ఎపిసోడ్ మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇచ్చింది. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వంగ‌వీటి కుటుంబానికి అన్యాయం జ‌ర‌గ‌ద‌ని.. త‌గిన గౌర‌వం.. గుర్తింపు ల‌భిస్తాయ‌న్న హామీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు స్ప‌ష్టం చేశారు.

వంగ‌వీటి రాధాకు అన్యాయం చేయాల‌న్న ఆలోచ‌న త‌మ పార్టీకి లేద‌ని చెప్పిన ఆయ‌న‌.. గ‌తంలో రాధా విజ‌య‌వాడ ఈస్ట్ నుంచి గెలిచార‌ని.. ఇప్పుడు ఆయ‌న అక్క‌డ గెలుస్తార‌నే అధిష్ఠానం భావిస్తుంద‌న్నారు. మ‌చిలీప‌ట్నం ఎంపీ స్థానం కూడా పార్టీ ఆయ‌న‌కు ఆప్ష‌న్ ఇచ్చింద‌న్న అంబ‌టి.. పార్టీ నిర్ణ‌యాన్ని రంగా అభిమానులు గౌర‌వించాల‌న్నారు.

మ‌రోవైపు అసెంబ్లీలో బాబు ప్ర‌సంగంపై అంబ‌టి స్పందించారు. టీఆర్ ఎస్ తో క‌లిసి ఉందామ‌ని అనుకున్న వైనాన్ని ప్ర‌స్తావిస్తూ.. టీఆర్ఎస్‌తో క‌లిసి ఉండాల‌న్న‌దే బాబు ఆలోచ‌న అయితే.. టీఆర్ఎస్ వ్య‌వ‌హారాల్లో ఎందుకు త‌ల‌దూర్చార‌ని సూటిగా ప్ర‌శ్నించారు.

ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్ అయ్యాక హైద‌రాబాద్ నుంచి ఎందుకు పారిపోయి వ‌చ్చార‌ని నిల‌దీశారు. ఈ కేసు త‌ర్వాత రాష్ట్రానికి జ‌రుగుతున్న అన్యాయంపై ఏపీ ముఖ్య‌మంత్రి హోదాలో చంద్ర‌బాబు ఒక్క‌సారైనా ప్ర‌శ్నించారా? అని క్వ‌శ్చ‌న్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ ఏపీకి వ‌స్తే న‌ల్ల‌జెండాల‌తో స్వాగ‌తం ప‌లికిన టీడీపీ శ్రేణులు.. ఇప్పుడు మౌనంగా ఎందుకు ఉన్నాయో స‌మాధానం చెప్పాల‌న్నారు. చౌక‌బారు రాజ‌కీయాలు చేసే వ్య‌క్తి బాబు అని మండిప‌డ‌డ్ఆరు. మోడీతో క‌లిసి ఉన్న‌ప్పుడు హోదా గురించి ఎందుకు మాట్లాడ‌లేద‌న్న అంబ‌టి.. హోదా కోసం క‌ర్నూలు యువ‌కుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్నా ఎందుకు స్పందించ‌లేద‌ని దుయ్య‌బ‌ట్టారు. ధ‌ర్మాబాద్ కోర్టు వారెంట్ ఇష్యూ చేస్తే.. ఏపీలో బాబు వ‌ర్గీయులు హ‌డావుడి చేయ‌టం కామెడీగా ఉంద‌ని త‌ప్పు ప‌ట్టారు. మొత్తంగా బాబుపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ‌టంతో పాటు.. రంగా ఫ్యామిలీ ఎపిసోడ్ మీదా అంబ‌టి త‌న ప్రెస్ మీట్లో క్లారిటీ ఇచ్చేశార‌ని చెప్ప‌కత‌ప్ప‌దు.