Begin typing your search above and press return to search.

అంబ‌టి పంచ్ ల‌కు చిన్న‌బోయిన బాబు!

By:  Tupaki Desk   |   18 July 2019 4:47 AM GMT
అంబ‌టి పంచ్ ల‌కు చిన్న‌బోయిన బాబు!
X
చేయ‌కూడ‌ని త‌ప్పులు చేయ‌టంలో టీడీపీ అధినేత‌..ఏపీ విప‌క్ష నేత చంద్ర‌బాబుకే సాధ్యం. క‌ల‌లో కూడా ఊహించ‌లేని త‌ప్పుల్ని చేయ‌టం ద్వారా ఏపీ ప్ర‌జ‌లు రిజెక్ట్ చేసిన బాబు భాగోతాన్ని అసెంబ్లీ సాక్షిగా విడ‌మ‌ర్చి చెప్పారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు. మంచి మాట‌కారిగా పేరున్న అంబ‌టి త‌న అనుభ‌వాన్ని రంగ‌రించి బాబు త‌ప్పుల చిట్టాను విప్పారు.

తానేం త‌ప్పులు చేయ‌న‌ని త‌ర‌చూ చెప్పుకునే బాబుకు మ‌రో మాట మాట్లాడేందుకు అవ‌కాశం ఇవ్వ‌ని రీతిలో ఆయ‌న వ్యాఖ్య‌లు ఉన్నాయి. అంబ‌టి మాట‌ల ఇరిటేష‌న్ కు అప్ప‌టివ‌ర‌కూ బాబు ముఖాన ఉన్న చిరున‌వ్వు మాయ‌మైన ప‌రిస్థితి. నిజానికి బాబు చేసిన దారుణ‌మైన త‌ప్పుల్ని ఇప్ప‌టివ‌ర‌కూ ఎవ‌రూ బ‌య‌ట‌పెట్ట‌ని విష‌యాల్ని అంబ‌టి ప్ర‌స్తావించారని చెప్పాలి.

2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాలు విడుద‌లై.. బాబు ముఖ్య‌మంత్రి అయిన మొద‌టి వారంలో మాట్లాడిన మాట‌ల్ని ప్ర‌స్తావించారు. తాను హైద‌రాబాద్ లోనే ఉంటాన‌ని.. 2019లో జ‌రిగే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో పార్టీని గెలిపించుకొన్న త‌ర్వాతే తాను ఏపీకి వెళ‌తాన‌ని వ్యాఖ్యానించారని.. అలాంటి ఆయ‌న ఏపీకి అంత హ‌డావుడిగా ఎందుకు వ‌చ్చిన‌ట్లు? అని ప్ర‌శ్నించారు.

హైద‌రాబాద్ లోనే ఉంటాన‌ని చెబుతూ.. సెక్ర‌టేరియ‌ట్ లో త‌న ఛాంబ‌ర్ ను ముస్తాబు చేసేందుకు కోట్లాది రూపాయిల్ని ఖ‌ర్చు చేయ‌టం.. చివ‌ర‌కు దానిని వినియోగించ‌కుండా వ‌చ్చేయ‌టాన్ని ప్ర‌స్తావించారు.

ఏపీలో ఇల్లు లేని బాబు.. హైద‌రాబాద్ లో ఉన్న ఇంటిని కూల్చేసుకొని కొత్త ఇల్లు క‌ట్టుకోవ‌టాన్ని ప్ర‌స్తావించిన అంబ‌టి.. ఏపీలో ఎందుకు క‌ట్టుకోలేదు? అన్న క్వ‌శ్చ‌న్ వేశారు.

అక్ర‌మంగా క‌ట్టిన ప్ర‌జావేదిక‌ను కూల్చేశారంటున్నార‌ని.. అక్ర‌మంగా క‌డితే చూస్తూ ఊరుకోవాలా? అన్న అంబ‌టి.. లింగ‌మ‌నేని గెస్ట్ హౌస్ లో బాబు ఉంటున్నార‌ని.. దాని నిర్మాణం అక్రంగా ఉండ‌టంతో నోటీసులు ఇచ్చార‌న్నారు. మా ఇంటికి రండి.. మా ఇంటికి రండ‌ని బాబును పిలుస్తున్న‌ట్లు చెప్పుకుంటున్నార‌ని.. అస‌లు అమ‌రావ‌తిలో ఇల్లు ఎందుకు లేదంటూ క్వ‌శ్చ‌న్ చేశారు. ఇలా తాను కానీ త‌న బ్యాచ్ కానీ జ‌వాబులు ఇవ్వ‌ని ప్ర‌శ్న‌ల‌తో ఉక్కిరిబిక్కిరి చేసిన అంబ‌టి పుణ్య‌మా అని.. బాబు ముఖాన న‌వ్వు మాయ‌మై.. గంభీరంగా ఉండిపోయారు.