అరెస్టులపై మండిపడుతున్న వైసీపీ

Fri Apr 21 2017 19:56:35 GMT+0530 (IST)

సోషల్ మీడియాకు సంకెళ్లు వేసేలా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. సోషల్ మీడియాలో పొలిటికల్ పంచ్ అనే పేజీని నడిపిస్తున్న ఇంటూరి రవికిరణ్ ను అరెస్ట్ చేయడంపై అంబటి రాంబాబు మండిపడ్డారు. మీడియాను లోబర్చుకున్న బాబు సోషల్ మీడియాను కూడ కంట్రోల్ చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాకు సంకెళ్లు వేయాలనుకోవడం చంద్రబాబు పిచ్చితనమని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.సోషల్ మీడియాకు ఏపీ సీఎం చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ భయపడుతున్నారనడానికి రవికిరణ్ అరెస్టే నిదర్శనమని అంబటి మండిపడ్డారు. అవినీతి అక్రమాలు దుర్మార్గాలను వెలుగులోకి తెస్తే అరెస్ట్ చేస్తారా..? అని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రవికిరణ్ కు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అండగా ఉంటామని అంబటి స్పష్టం చేశారు. కాగా రవికిరణ్ ను కోర్టులో హాజరుపర్చకపోతే నిరసన తెలుపుతామని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి హెచ్చరించారు. అక్రమ అరెస్టును నిరసిస్తున్నట్లు స్పష్టం చేశారు.

కాగా తన భర్త అరెస్టుపై రవికిరణ్ సతీమణి శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా తీసుకువెళ్లినందుకు కిడ్నాప్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పోలీసులు తగు న్యాయం చేయాలని రవికిరణ్ సతీమణి డిమాండ్ చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/