Begin typing your search above and press return to search.

బీజేపీ-టీడీపీ బంధానికి ఇదే సాక్ష్యం

By:  Tupaki Desk   |   18 July 2018 11:06 AM GMT
బీజేపీ-టీడీపీ బంధానికి ఇదే సాక్ష్యం
X
చంద్ర‌బాబు కుయుక్తుల‌కు - రాజ‌కీయాల‌కు పెట్టింది పేరు - ఆయ‌న న‌మ్మితో కుక్క‌తోక ప‌ట్టుకుని గోదారి ఈదిన‌ట్టేన‌ని వైసీపీ నాయ‌కుడు అంబ‌టి రాంబాబు వ్యాఖ్యానించారు. పైకి ఒక‌రినొకరు తిట్టుకుంటూ తిరుగుతున్న‌ బీజేపీ - టీడీపీ లోపాయ‌కారీ బంధం ఈరోజు సాక్ష్యాధారాల‌తో స‌హా బ‌య‌ట‌ప‌డింద‌ని అంబ‌టి రాంబాబు విమ‌ర్శించారు.

ఇది ఎంత పెద్ద డ్రామా అంటే... గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అవిశ్వాసం పెడ‌తాను అంటే... సంపూర్ణ మెజారిటీ ఉండే ప్ర‌భుత్వంపై అవిశ్వాసం పెడితే ఏం ప్ర‌యోజ‌నం అని పిచ్చి విమ‌ర్శ‌లు చేసిన చంద్ర‌బాబు తరువాత ప్ర‌జలు వైసీపీ పోరాటాన్ని అర్థం చేసుకుని విష‌యం తెలుసుకుని త‌నూ అవిశ్వాసం అంటూ ముందుకొచ్చార‌న్నారు. గ‌త పార్ల‌మెంటు స‌మావేశంలో ఎన్ని సార్లు పెట్టిన అవిశ్వాసాన్ని ఉద్దేశ పూర్వ‌కంగా ప‌క్క‌న పెట్టిన బీజేపీ ఈసారి చంద్ర‌బాబు ఇలా పెట్ట‌గానే అలా స్వీక‌రించ‌డానికి కార‌ణాలేంటి? అంటూ ప్ర‌శ్నించింది. వారిద్ద‌రి లోపాయ‌కారీ ఒప్పందం ప్ర‌కార‌మే ఈ అవిశ్వాసం పెట్టార‌ని, అందుకే వెంట‌నే స్పీక‌రు దానిని ఆమోదించార‌ని అంబ‌టి రాంబాబు ఆరోపించారు.

బీజేపీ స‌ర్కారును కూల‌గొట్టే ఉద్దేశం చంద్ర‌బాబుకు అస్స‌లు లేద‌న్నారు. ఇది ప్ర‌జ‌ల‌తో మార్కులేయించుకోవ‌డానికి ఢిల్లీ వేదికగా తెలుగుదేశం పార్టీ మొద‌టుపెట్టిన కొత్త డ్రామా మాత్ర‌మే అని విమ‌ర్శించారు. అస‌లు టీడీపీకి అంత చిత్త‌శుద్ధి ఉంటే... వైసీపీ అవిశ్వాసానికే మ‌ద్ద‌తు ఇచ్చేద‌న్నారు.

హెడ్ కౌంట్‌తో అవిశ్వాసం అనుమ‌తించాల‌నుకున్న‌పుడు గ‌త స‌మావేశాల్లోనే అనుమ‌తించి ఉండొచ్చు అని, కాన ఈ ఎందుకు చర్చ జరపలేదని - ఎందుకు హెడ్ కౌంట్ చేయలేదని అనుమానం వ్య‌క్తం చేశారు. స‌రిగ్గా ఈ స‌మావేశాల‌కు కొద్ది రోజుల ముందే బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా - టీడీపీ రాజగురువుతో చర్చలు జర‌పడానికి దీనికి లింకుంద‌ని అన్నారు. అక్క‌డ కుదిరిన స‌యోధ్య‌కు ఈరాజు పార్ల‌మెంటులో ఘ‌ట‌న‌లు ఉదాహ‌ర‌ణ‌గా వ్యాఖ్యానించారు.

ప్ర‌జ‌లు కోసం ప‌దవులు వ‌దిలేసిన వారిపై ఆ ప‌ద‌వుల‌నే ప‌ట్టుక‌ని వేలాడుతున్న టీడీపీ నేత‌లు చేసే విమ‌ర్శ‌లు తెలుగు వాళ్లు త‌ల‌దించుకునే సిగ్గుమాలిన రాజకీయాలు అని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఢిల్లీ వేదికగా మహాకుట్ర జరిగిందని - బీజేపీ - చంద్రబాబుల రాజ‌కీయ స్వ‌ప్ర‌యోనాల కోసం ఏపీ బ‌ల‌వుతోంద‌న్నారు. అందుకే వైసీపీ ఎంపీల రాజీనామాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నార‌న్నారు.