ఒక్కరోజులో 66వేల కోట్లు నష్టపోయిన బెజోస్!

Fri Oct 12 2018 21:26:45 GMT+0530 (IST)

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్....ఆన్ లైన్ గ్లోబల్ మార్కెట్ ను శాసిస్తోన్న సంగతి తెలిసిందే. 2018కుగాను ప్రపంచ అపర కుబేరుడిగా అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ వెలుగొందుతోన్న సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా జెఫ్ బెజోస్ బుధవారం నాడు దాదాపు 66వేల కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని నష్టపోయారు. గ్లోబల్ మార్కెట్ సెల్ ఆఫ్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా 500మంది బిలియనీర్లు పెద్ద మొత్తంలో నష్టపోయారు. వారిలో బెజోస్ ఒక్కరే దాదాపు 66 వేల కోట్లు నష్టపోవడం విశేషం. ఆ తర్వాతి స్థానంలో యూరప్ కు చెందిన వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్ 33 వేల కోట్ల రూపాయలు నష్టపోయారు.మార్కెట్ పతనం వల్లే ఇంత పెద్ద మొత్తంలో బిలియనీర్లు నష్టయారని బ్లూమ్ బర్గ్ తన అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇందులో బెర్నార్డ్ ఆర్నాల్ట్ 33 వేల కోట్ల రూపాయలు నష్టపోవడం ఆశ్చర్యకరమని తెలిపింది. ఈ ఏడాది వచ్చిన లాభాల్లో అతడు 50 శాతం నష్టపోయారని చెప్పింది. చైనా బోర్డర్ లో భద్రత పెంచిన నేపథ్యంలో బెర్నాల్డ్ కంపెనీ ఎల్ వీ ఎమ్ హెచ్ షేర్లు పూర్తిగా పడిపోయాయని అందువల్ల ఇంత నష్టం జరిగిందని తెలిపింది. వారెన్ బఫెట్ కూడా ఓవరాల్ గా 33 వేల కోట్లు నష్టపోయారట. ఇక ప్రపంచవ్యాప్తంగా 67 మంది బిలియనీర్లు 2.3లక్షల కోట్లు ఒక్క సారిగా నష్టపోయారని ఆ సంస్థ వెల్లడించింది.