Begin typing your search above and press return to search.

సిద్ధూ రాజీనామాను ఇవ్వనేలేదట!

By:  Tupaki Desk   |   15 July 2019 2:30 PM GMT
సిద్ధూ రాజీనామాను ఇవ్వనేలేదట!
X
పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో రేగిన రచ్చ గురించి తెలిసిందే. లోక్ సభ సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచినే అక్కడ కాంగ్రెస్ లు లుకలుకలున్నాయి. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ - మంత్రి నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూల మధ్యన విబేధాలు రచ్చకు ఎక్కాయి.

సిద్ధూ అంటే కెప్టెన్ కు అస్సలు పడటం లేదు. మొదట్లో అమరీందర్ ను కెప్టెన్ గానే గౌరవించిన సిద్ధూ ఆ తర్వాత మాత్రం ఆయనపై ఎదురుదాడికి కూడా వెనుకాడలేదు. అమరీందర్ సింగ్ చెప్పడంతో సిద్ధూ టీవీ చానళ్లతో ఒప్పందాలను కూడా రద్దు చేసుకోవాల్సి వచ్చింది.

మంత్రి పదవి కావాలా - టీవీ షోలు కావాలా? అని అమరీందర్ ప్రశ్నించడంతో సిద్దూ చానళ్లతో ఒప్పందాలను రద్దు చేసుకున్నాడు. ఆ తర్వాత వివిధ సందర్భాల్లో సిద్ధూ వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. అప్పుడు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసిన వారిలో అమరీందర్ కూడా ఉన్నారు.

ఇక లోక్ సభ ఎన్నికల తర్వాత వారిద్దరి మధ్యన విబేధాలు మరింతగా ముదిరాయి. ఈ నేపథ్యంలో తను మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా సిద్ధూ ప్రకటించారు. కొన్నాళ్ల కిందట కాంగ్రెస్ లో చేరిన సిద్ధూ కథ అలా ముగిసిందని వార్తలు వచ్చాయి. అయితే సిద్ధూ రాజీనామా చేసిందని లేదని - మంత్రి పదవికి రాజీనామా చేసినట్టుగా సిద్ధూ తనకు ఎలాంటి లేఖను ఇవ్వడం కానీ - పంపడం కానీ జరగలేని అమరీందర్ అంటున్నారు!