Begin typing your search above and press return to search.

అమల అలా బూమరాంగ్ చూపించింది

By:  Tupaki Desk   |   30 Sep 2016 4:44 AM GMT
అమల అలా బూమరాంగ్ చూపించింది
X
ఐస్ బకెట్ ఛాలెంజ్.. రైస్ బకెట్ ఛాలెంజ్ అంటూ.. ఆన్ లైన్ లో సవాళ్లు విసురుకుని రియల్ లైఫ్ లో ఏదో ఒకటి చేసి.. దాన్ని నెట్ లో పెట్టేయడం ఈ మధ్య ఎక్కువయిపోయింది. ఇలాంటిదే బూమరాంగ్ ఛాలెంజ్ కూడా. దీని ప్రకారం.. బూమరాంగ్ షేప్ ని బాడీలో చూపిస్తూ ఉండాలి.. ఏదో ఒక ఫిజికల్ ఎక్సర్ సైజ్ కనిపించాలి. హెల్త్ గురించి చేపట్టిన చాలెంజ్ కాబట్టి స్పీడ్ గానే ఇది పాకిపోతోంది. ఇప్పుడీ సవాల్ అమలాపాల్ కి కూడా వచ్చింది. అది కూడా ఆమె తమ్ముడే ఈ ఛాలెంజ్ ని అమలకు విసిరాడు.

ఓ టీషర్ట్.. పొట్టి నిక్కరు వేసుకుని.. రెండు చేతులను బూమరాంగ్ టైపులో చూపించి.. వెనక్కు అలా వాలిపోయి.. నీళ్లలో పడిపోయిన వీడియోను.. అమలా పాల్ పోస్ట్ చేసింది. అంత నీళ్లలో అయినా.. నిజానికి అలా వెనక్కు పడ్డం అంటే అందుకు గుండె ధైర్యం చాలా కావాలి లెండి. కానీ ఈ డేరింగ్ విషయంలో అమల చాలా డేర్. ఆమె కాన్ఫిడెన్స్ లెవెల్స్ గమనిస్తే ఇలాంటివి చాలా చిన్నవే అనిపిస్తుంది. అందుకే అంత తేలిగ్గా ఆ బూమరాంగ్ ఛాలెంజ్ ని ఫినిష్ చేసేసింది.. 'యో.. యాక్సెప్టెడ్ బ్రో' అంటూ చెప్పడమే కాదు.. ఇంకో ఏడెనిమిది మందికి కూడా సవాల్ విసిరింది.

అయితే.. ఒత్తిడిలో పెర్ఫామ్ చేశానని.. గ్రౌండ్ పై మాత్రం ట్రై చేయద్దనే డిస్ క్లెైమర్ ను ట్యాక్స్ రూపంలో పెట్టడం చూస్తే.. అభిమానులపై అమల కేరింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/