Begin typing your search above and press return to search.

సంకీర్ణమే మోదీకి శరణ్యం!

By:  Tupaki Desk   |   18 Aug 2018 2:30 PM GMT
సంకీర్ణమే మోదీకి శరణ్యం!
X
రానున్న ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో వంటరిగా అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఈ సారి ఏ ఒక్క పార్టీ సింగిల్‌ గా అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పాటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతకు ముందు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినా ఎన్టీయే భాగస్వాముల తోటే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు. గడచిన నాలుగేళ్లలో నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో మిత్రపక్షాలు కూడా నివ్వేరపోయాయి. ఈ నాలుగేళ్లలో ప్రజలలో కూడా ఎన్డీ‍యే పక్షాలు నరేంద్ర మోదీ ఏలికపై నమ్మకం పోయింది. దీంతో ఈ సారీ భారతీయ జనతా పార్టీకి గణనీయంగా సీట్లు తగ్గే అవకాశం ఉంది.

అలాగే బిజేపీ తాలూకా రాష్ట్రాలలోను కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా లేదు. దీనిని ద్రుష్టిలో ఉంచుకుని సంకీర్ణం వైపే అడుగులు వేయాలని ప్రధాని నరేంద్ర మోదీ భావిస్తున్నారు. గతంలో మాజీ ప్రధాని - దివంగత నాయకుడు అటల్ బిహారి వాజ్‌ పేయ్ కూడా సంకీర్ణం వైపే మొగ్గు చూపారు. దేశంలోని మిత్రపక్షాలన్నిటినీ కలుపుకుని కాంగ్రెస్ ను ఓడించారు. ఇదే అనుభవంతో నరేంద్ర మోదీ కూడా ముందుకు సాగాలని భావిస్తున్నారు. ఇప్పటికే మిత్రపక్షాలైన తెలుగుదేశం - శివసేన ఎన్డీయేకు దూరం అయ్యాయి. మిగిలిన పార్టీలు కూడా ఆ దిశగానే పయనిస్తున్నాయి. అదే జరిగితే సంకీర్ణ ప్రభుత్వంలో మోదీకి చక్కెదురు అయినట్లే. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా సొంత బలంపై ఆశాలు పెట్టుకోవడం లేదు. తమతో కలసి వచ్చే అన్నీ పార్టీలను కలుపుకుపోవాలని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భావిస్తున్నారు. ఇందుకోసం పదవీ త్యాగానికి కూడా వెనుకాడనని ప్రకటిస్తున్నారు. నరేంద్ర మోదీ లక్ష్యంగా బిజేపీని గద్దె దించేందుకు అన్నీ పార్టీలతో కూటమి కట్టే పనిలో ఉన్నారు. ఆయనకు కలసివచ్చే దక్షిణాది పార్టీలతో పాటు ఉత్తారాది పార్టీలతో కూడా స్నేహ హస్తం అందించనున్నారు. ఈ రెండు జాతీయ పార్టీలు కూటమి కట్టడంలో తలమునకలైతే వీటిని కాలరాదని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఫెడరల్ ఫ్రంట్ అంటూ మూడవ కూటమికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సీనియర్‌ నాయకుల మమతా బెనర్జీ - దేవేగౌడ - నితీష్ కుమార్ - వామపక్ష నాయకులతో చర్చలు జరుపుతున్నారు. ఆ చర్చలు సఫలమైతే మూడవ కూటమి పురుడు పోసుకుంటుంది. ఈ పరిస్థితులు గమనిస్తే రానున్న ఎన్నికలలో సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పాటయ్యే అవకాశాలున్నాయి.