హైదరాబాదులో మిషన్ రెడీ.. మీరు రెడీనా?

Thu Dec 06 2018 20:35:45 GMT+0530 (IST)

శాసనసభ ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరింది. ఎన్నికలకు సంబంధించి హైదరాబాద్ లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే ఈవీఎం - వీవీ ప్యాట్ మిషన్లు సిద్ధంగా ఉన్నారు. అభ్యర్థులకు సంబంధించిన సమాచారాన్ని ఈ మిషన్లలో ఇప్పటికే అప్ లోడ్ చేశారు. సిబ్బంది కూడా ఈవీఎంలతో పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. జిల్లాలో 3873 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటయ్యాయి. హైదరాబాద్ లోని అన్ని నియోజకవర్గాలకు పోలింగ్ సిబ్బందిని నియమించారు.ఓటింగ్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా సిబ్బందికి శిక్షణ కూడా పూర్తయ్యింది. అలాగే మైక్రో అబ్జర్వర్ట్స్ - వెబ్ కాస్టింగ్ సిబ్బంది - దివ్యాంగ ఓటర్లకు సాయం చేయడానికి ఎన్ ఎస్ ఎస్ స్టూడెంట్స్.. ఇలా అందరూ ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు. పోలింగ్ సిబ్బందితో పాటు పోలీసులు - ఇతర అధికారులు కలిపి హైదరాబాద్ లో  మొత్తంగా 40 వేల మంది విధులు నిర్వహిస్తున్నారు.

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశారు. పారా మిలిటరీ - కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర పోలీసులు సిద్ధంగా ఉన్నారు. శాంతి భద్రతలకు సంబంధించి.. చాలాకాలంగా చిన్న ఇన్సిడెంట్ కూడా లేదు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బంది వచ్చే అవకాశాల్లేవు. అయినప్పటికీ ఎక్కడా ఎలాంటి ఇబ్బందికి తావు లేకుండా హైదరాబాద్ ఎన్నికల అధికారి దాన కిశోర్ పోలీస్ శాఖకో-ఆర్డినేషన్ తో పనిచేస్తున్నారు.

మోతాదుకు మించి ఓటింగ్ ఎక్కువగా జరిగే అవకాశమున్న ప్రాంతాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. అక్కడ పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్ లో వెబ్ రికార్డింగ్ - వెబ్ కాస్టింగ్ ఉంటాయి. కొన్ని చోట్ల సీసీటీవీలు - వీడియో రికార్డింగ్ సిద్ధంగా ఉన్నాయి. కమాండ్ కంట్రోల్ రూం నుంచి అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తారు. రూట్ మెజిస్ట్రేట్లు ఎక్కడికక్కడ తనిఖీలను చేపట్టారు.