చంద్రబాబుతో అలీ భేటీ మంత్రి పదవి కన్‌ఫర్మ్ అయ్యిందా?

Sun Jan 20 2019 19:50:38 GMT+0530 (IST)

 సినీ హాస్య నటుడు అలీ రాజకీయాల్లో కి వస్తున్నారనేది కన్‌ఫర్మ్. ఈ విషయాన్ని ఆయనే స్పయంగా ప్రకటించాడు. అయితే ఏ పార్టీలో చేరేది ఇంతవరకు ఎవ్వరికి చెప్పలేదు. పాదయాత్ర సందర్భంగా వైసీపీ అధినేత జగన్‌ని కలిశారు. ఆ తర్వాత చంద్రబాబుని ఆ తర్వాత జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ని కూడా అలీ కలవడంతో.. అసలు ఆయన ఏ పార్టీలో చేరతారో ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితి. అయితే.. తనకు ఎవరు మంత్రిపదవి ఇస్తారో ఆ పార్టీలోనే చేరతానని ప్రకటించారు. అలీ ప్రకటన తర్వాత.. ఆయన ఆదివారం చంద్రబాబుతో భేటీ అయ్యారు. దాదాపు 15 నిమిషాలు సమావేశం అయ్యారు.అలీ ప్రస్తుతం టీడీపీ పార్టీలోనే ఉన్నారు.  గత ఎన్నికల్లో గుంటూరు టిక్కెట్ ఆశించారు. కానీ ఆ సీటు ముందే ఫిక్సై పోవడంతో.. సత్తెనపల్లి ఇస్తానని చెప్పారు చంద్రబాబు. ఈ ఆఫర్‌ని అలీ తిరస్కరించారు. దీంతో.. ఇప్పుడు అలీకి గుంటూరు టిక్కెట్ కన్‌ఫర్మ్‌గా వస్తుందనే ఊహాగానాలు విన్పిస్తున్నాయి. మళ్లీ అధికారంలోకి వస్తే అలీకి మంత్రిపదవి కూడా ఇవ్వడం ఖాయమని.. అందుకే చంద్రబాబుతో భేటీ అయ్యారని వార్తలు విన్పిస్తున్నాయి. మరి చంద్రబాబుతో భేటీ ఎన్నికల భేటీయా లేదా మామూలు భేటీయా తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.