Begin typing your search above and press return to search.

తండ్రికి ఉన్న ఆ పోస్టునూ అఖిలేష్‌ పీకేశాడే!

By:  Tupaki Desk   |   17 Oct 2017 4:23 AM GMT
తండ్రికి ఉన్న ఆ పోస్టునూ అఖిలేష్‌ పీకేశాడే!
X
తండ్రి నుంచి పార్టీ అంతా త‌న చేతుల్లోకి తీసుకోవాల‌ని కొడుకు!! ఆ వ్యూహాలకు ఎలాగైనా చెక్ చెప్పాల‌ని తండ్రి!! ఇదీ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల ముందు వ‌ర‌కూ స‌మాజ్‌వాదీ పార్టీలో న‌డిచిన హైడ్రామా! అది ముగిసింది. ఓట‌మి వ‌రించింది. వీరి పోరు బీజేపీకి ప్ల‌స్ అయింది. ఇప్పుడు అంతా ప్ర‌శాంతం అనుకున్న స‌మ‌యంలో తండ్రీకొడుకుల వార్ మొద‌టికి వ‌చ్చింది! ముస‌లం మ‌ళ్లీ మొద‌లైంది. ఇన్నాళ్లూ సైకిల్ సాఫీగా వెళిపోతోంద‌ని అనుకున్న వారంద‌రికీ పెద్ద షాక్ త‌గిలింది. అంతా ప్ర‌శాంత‌మే అనుకున్న స‌మ‌యంలో తండ్రికి కొడుకు ఝ‌ల‌క్ ఇచ్చారు. తండ్రికే కాదు బాబాయ్‌ కి కూడా ఇప్పుడు ఊహించ‌ని ప‌రిణామం ఎదురైంది. స‌మాజ్‌ వాద్ పార్టీలో సంక్షోభానికి ఇంకా తెర‌ప‌డలేదు.

రోజురోజుకు మారిపోయే రాజ‌కీయ ప‌రిణామాలు! తండ్రి వ‌ర్గం ఎత్తులు.. దానిని చిత్తు చేసేందుకు కొడుకు వ‌ర్గం వ్యూహాలు! ఒక‌రోజు క‌లిసిపోతారు.. మ‌రోరోజు విడిపోతారు! ఒక‌పూట మా మ‌ధ్య విభేదాలు ఏమీ లేవంటారు.. మరోపూట నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటారు! ఇటువంటి అనూహ్య ప‌రిణామాలెన్నో!! ప్రస్తుతం పార్టీ వ్యవస్థాపకుడైన తన తండ్రి ములాయం సింగ్‌ కు అఖిలేశ్‌ యాదవ్‌ మరోసారి ఝలక్ ఇచ్చారు. సమాజ్‌ వాదీ పార్టీ జాతీయ కార్యవర్గ కమిటీ నుంచి ములాయం - ఆయన సోదరుడు శివపాల్‌ యాదవ్‌ ను తొలగించారు. వీరికి ఎటువంటి పదవులు కేటాయించలేదని ఈసీకి సమర్పించిన పార్టీ జాతీయ ఆఫీస్‌ బేరర్స్‌ లిస్టులో స్ప‌ష్టం చేశారు.

అఖిలేశ్‌ తో ఎటువంటి విభేదాలు లేవని - తాను కొత్త పార్టీ పెట్టడం లేదని ములాయం ప్రకటించిన కొద్దిరోజులకే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. అయితే సమాజ్‌వాదీ పార్టీ సంరక్షుడిగా(పాట్రాన్‌) ములాయంను కొనసాగిస్తారా, లేదా అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే పార్టీలో అలాంటి పదవి ఏదీలేదని అధికార ప్రతినిధి రాజేంద్ర చౌధురి తెలిపారు. `ఇలాంటి పదవి కోసం పార్టీ రాజ్యాంగంలో ఎటువంటి నిబంధన లేదు. ములాయం పార్టీ సంరక్షుడి పదవిలో ఉన్నారో - లేదో నాకు తెలియద`ని వ్యాఖ్యానించారు. కొడుకుతో విభేదాల కారణంగా పార్టీ అధ్యక్ష పదవిని ములాయం కోల్పోయిన విష‌యం తెలిసిందే.