Begin typing your search above and press return to search.

మోడీ ప్రధాని కావటంపై అక్బర్ ఆక్రోశం

By:  Tupaki Desk   |   5 Oct 2015 6:07 AM GMT
మోడీ ప్రధాని కావటంపై అక్బర్ ఆక్రోశం
X
ప్రధానిగా మోడీ ప్రమాణస్వీకారం చేసి పదహారు నెలలు దాటుతున్నా.. అసలు ఆయన ప్రధానమంత్రి ఎందుకయ్యారన్న అక్రోశాన్ని మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఓవైసీ వ్యక్తం చేస్తున్నారు. తిరుగులేని బంపర్ మెజార్టీతో ఎన్డీయే విజయం సాధించి.. అధికార పగ్గాల్ని అందిపుచ్చుకున్న వైనంపై తనకున్న అసంతృప్తిని అక్బరుద్దీన్ మరోసారి బయటపెట్టారు.

బీహార్ ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగిన మజ్లిస్ తరఫున ప్రచారం చేసేందుకు వచ్చిన ఆయన.. మోడీపై తీవ్ర విమర్శలు చేశారు. బీహార్ లోని పలు ప్రాంతాల్లో ఇప్పటివకే పలు సభల్లో మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రచారం చేస్తే.. తాజాగా అక్బరుద్దీన్ తోడయ్యారు. కాంగ్రెస్ అసమర్థత వల్లే నరేంద్ర మోడీ దేశ ప్రధాని అయ్యారన్న ఆయన.. 2002 నాటి గుజరాత్ అల్లర్లకు సంబంధంపై మోడీపై కాంగ్రెస్ ఉక్కుపాదం మోపి.. బలమైన సాక్ష్యాలతో కేసు నమోదు చేసి ఉంటే..ఈ రోజు మోడీ ప్రధాని కాగలిగేవారు కాదంటూ కొత్త ఆలోచల్ని ఆవిష్కరిస్తున్నారు. చూస్తుంటే.. అక్బర్ లాంటి వారి చేతికికానీ రాజ్యాధికారం వస్తే.. రాజకీయ ప్రత్యర్థులంతా కేసుల్లో ఇరుక్కుపోయి జైలు ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుందేమో?

కేసులు పెట్టి ప్రత్యర్థి రాజకీయ నేతల్ని ఎలా తొక్కేయాలన్న ఐడియాలు ఇస్తున్న అక్బరుద్దీన్.. ప్రధాని మోడీ విదేశీ పర్యటనలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి.. విదేవీ పర్యటనల్లో మునిగితేలుతూ.. ప్రవాస భారత ప్రధానిగా మోడీని అభిర్ణించి తన కసిని తీర్చుకున్నారు.