Begin typing your search above and press return to search.

ఆకాశంలో వాషింగ్ మెషీన్‌ లా ఊగిన ఫ్లైట్‌

By:  Tupaki Desk   |   25 Jun 2017 12:11 PM GMT
ఆకాశంలో వాషింగ్ మెషీన్‌ లా ఊగిన ఫ్లైట్‌
X
స‌దూర ప్ర‌యాణంలో ఉన్న విమానం.. మార్గ‌మ‌ధ్యంలో.. ఆకానికి కొన్ని వేల అడుగుల ఎత్తులో ఉన్న వేళ‌.. ఒక్క‌సారిగా వాషింగ్ మెషీన్ ఊగిన‌ట్లుగా ఊగిపోతే? వినేందుకు ఒళ్లు జ‌ల‌ద‌రించేలా ఉన్న ఈ ఉదంతం రియ‌ల్‌ గా చోటు చేసుకుంది. ఒక్క‌సారిగా చోటు చేసుకున్న ఈ ఉదంతంలో విమానంలో ప్ర‌యాణిస్తున్న ప్ర‌యాణికులు ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డారు. క‌నిపించ‌ని దైవాన్ని త‌లుచుకొని త‌మ‌ను ర‌క్షించాల‌ని వేడుకున్నారు. అంత‌కు మించి ప్రార్థ‌న‌లు చేశారు. సాంకేతిక లోపం కార‌ణంగా ముచ్చెమ‌ట‌లు పోయించిన వైనంలోకి వెళితే..

మ‌లేషియా నుంచి ఆస్ట్రేలియాకు వెళుతున్న ఎయిర్ ఏషియా విమానం సాంకేతికంగా చోటు చేసుకున్న స‌మ‌స్య‌తో అనూహ్య ప‌రిణామం చోటు చేసుకుంది. గాల్లో చ‌క్క‌ర్లు కొడుతూ ఒక్క‌సారిగా భారీ కుదుపుల‌కు లోనైంది. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన విమాన సిబ్బంది విమానాన్ని దారి మ‌ళ్లించి ప్ర‌యాణికుల్లో టెన్ష‌న్‌ ను తాత్కాలికం త‌గ్గించే ప్ర‌య‌త్నం చేశారు. విమానంలోని ఇంజిన్‌ లో చోటు చేసుకున్న లోపాన్ని గుర్తించిన పైలెట్ విమానాన్ని వెంట‌నే పెర్త్ లో ల్యాండ్ చేశారు.

విమానంలో ప్ర‌యాణిస్తున్న ప్ర‌యాణికుల‌కు ఎలాంటి ప్ర‌మాదం చోటు చేసుకోలేద‌ని.. అంద‌రూ క్షేమంగా ఉన్న‌ట్లు విమాన సంస్థ ప్ర‌తినిధులు చెబుతున్నారు. విమానంలో ప్ర‌యాణించిన ప్ర‌యాణికులు కొంద‌రు మాట్లాడుతూ.. త‌మ‌కు ఎదురైన భ‌యంక‌ర‌మైన అనుభ‌వాన్ని వివ‌రించారు. ఒక్క‌సారిగా విమానం వాషింగ్ మెషీన్ల మాదిరి మారిపోయి ఊగిపోయింద‌ని.. తామంతా చాలా భ‌య‌ప‌డిపోయిన‌ట్లుగా ఒక ప్ర‌యాణికుడు పేర్కొన్నారు. క్షేమంగా ల్యాండ్‌కావాల‌ని విమానంలోని వారంతా ప్రార్థ‌న‌లు చేసిన‌ట్లుగా పేర్కొన్నారు. నెల వ్య‌వ‌ధిలో ఆస్ట్రేలియాకు చెందిన ఎయిర్‌బ‌స్ ఏ330 విమానంలో ఇలాంటి సాంకేతిక లోపం చోటు చేసుకోవ‌టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/