Begin typing your search above and press return to search.

బ‌రువు త‌గ్గ‌క‌పోతే జీతం త‌గ్గిపోతోంది!

By:  Tupaki Desk   |   20 Jan 2017 1:23 PM GMT
బ‌రువు త‌గ్గ‌క‌పోతే జీతం త‌గ్గిపోతోంది!
X
నాజూకుత‌న‌మే నారీమ‌ణుల‌కు అందం... అదే ఆభ‌ర‌ణం! ఇంకా చెప్పాలంటే... ఎయిర్ హోస్ట‌స్‌ కు అదే ప్రధాన అర్హ‌త కూడా! ఎయిర్ హోస్టెస్ గా పనిచేస్తున్న‌వారు బ్యూటీ కేర్ తోపాటు హెల్త్ కేర్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా శ‌రీర బ‌రువును జాగ్ర‌త్త‌గా కాపాడుకోవాలి. బ‌రువు కాస్త ఎక్కువైతే... వారికి స‌మ‌స్య‌లు మొద‌లైన‌ట్టే! ప్ర‌స్తుతం ఇలాంటి ఇబ్బందుల్నే ఎదుర్కొంటున్నారు ఎయిర్ ఇండియాలో ప‌నిచేస్తున్న కొంత‌మంది ఎయిర్ హోస్టెస్‌.

క్యాబిన్ క్రూలో ప‌నిచేస్తున్న కొంత‌మంది ఎయిర్ హోస్టెస్ కాస్త బ‌రువు పెరిగిన‌ట్టు గ‌త నెల‌లో ఎయిర్ ఇండియా గుర్తించింది. అంతే... హుటాహుటిన వారికి హెచ్చ‌రిక‌లు కూడా జారీ అయిపోయాయి. వీలైనంత త్వ‌ర‌గా వెయిట్ త‌గ్గించుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అనుకున్న స‌మ‌యం ప్ర‌కారం బ‌రువు త‌గ్గించుకోక‌పోతే క్యాబిన్ క్రూ విధుల నుంచి త‌ప్పించేసి... శాశ్వ‌తంగా గ్రౌండ్ డ్యూటీల‌కు ప‌రిమితం చేసేస్తామ‌ని కూడా వార్నింగ్ ఇచ్చేసింది. దీంతో 57 మంది క్యాబిన్ క్రూ ఉద్యోగుల‌కు కొత్త టెన్ష‌న్ ప‌ట్టుకుంది.

క్యాబిన్ క్రూలోనే ఎందుకూ, గ్రౌండ్ డ్యూటీస్ లో ఉన్నా ఉద్యోగానికి ఎలాంటి ఢోకా ఉండ‌దు క‌దా అనిపించొచ్చు. క‌రెక్టే... కానీ, ఈ రెండింటికీ ఆదాయంలో చాలా వ్య‌త్యాసం ఉంది. క్యాబిన్ క్రూలో ఉంటే నెల‌కు రూ. 35 వేల నుంచి రూ. 50 వేల వ‌ర‌కూ అద‌న‌పు అల‌వెన్సులు వ‌స్తుంటాయి. గ్రౌండ్ డ్యూటీలోనే శాశ్వ‌తంగా ఉండిపోతే ఆ అల‌వెన్సుల‌న్నింటినీ శాశ్వ‌తంగా వ‌దులుకోవాల్సి ఉంటుంది. ఇప్ప‌టికే కొంత‌మందికి బ‌రువు త‌గ్గేందుకు గ‌డువు ఇచ్చామ‌నీ, త‌గ్గ‌ని వాళ్ల‌ని గ్రౌండ్ డ్యూటీస్ విభాగానికి బ‌దిలీ చేశామ‌ని ఓ అధికారి చెప్పారు. బాడీమాస్ ఇండెక్స్ (బీఎంఐ) ప్ర‌కారం అధిక బ‌రువు క‌లిగిన ఎయిర్ హోస్టెస్ ను ఆర్నెల్ల‌పాటు క్యాబిన్ క్రూ డ్యూటీల నుంచి అన‌ర్హ‌లుగా ప్ర‌క‌టిస్తారు. సో... వీళ్ల‌కి ఇప్పుడు బ‌రువు త‌గ్గ‌డం అత్యావ‌శ్య‌కం అన్న‌మాట‌!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/