Begin typing your search above and press return to search.

హీరో పొలిటికల్‌ ఎంట్రీ... సోషల్‌ మీడియా సందడి

By:  Tupaki Desk   |   24 April 2019 11:24 AM GMT
హీరో పొలిటికల్‌ ఎంట్రీ... సోషల్‌ మీడియా సందడి
X
బాలీవుడ్‌ సీనియర్‌ స్టార్‌ హీరో సన్నీ డియోల్‌ బీజేపీలో చేరి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయబోతున్న విషయం తెల్సిందే. ఫిల్మ్‌ స్టార్స్‌ రాజకీయాల్లోకి రావడం, ఎన్నికల్లో పోటీ చేయడం ఈమద్య కామన్‌ అయినా కూడా సన్నీ డియోల్‌ ఎంట్రీతో సోషల్‌ మీడియాలో కాస్త హడావుడి కనిపిస్తుంది. సన్నీ డియోల్‌ గత చిత్రాల్లోని క్లిప్‌ లతో మీమ్స్‌ క్రియేట్‌ చేసి చాలా క్రియేటివ్‌ గా సన్నీ డియోల్‌ రాజకీయ అరంగేట్రంకు కొందరు నెటిజన్స్‌ వెల్‌ కం చెప్పారు.

కొన్నాళ్ల క్రితం సన్నీ డియోల్‌ నటించిన 'గదర్‌' చిత్రంలో పాక్తిస్థాన్‌ రోడ్డుపై ఒక ఫైట్‌ సీన్‌ ఉంటుంది. ఆ సీన్‌ లో భాగంగా పక్కన ఉన్న బోరింగ్‌ భూమిలోంచి పెగలించి రౌడీలను కొట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఆ వీడియోను సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ చేస్తున్నారు. సన్నీ డియోల్‌ ఎంపీ అయ్యితే పాకిస్తాన్‌ లోని బోరింగ్‌ పంపులు అన్ని లేపేస్తాడంటూ, వాటికి తాళాలు ఏర్పాటు చేస్తున్నట్లుగా మీమ్స్‌ క్రియేట్‌ చేసి సోషల్‌ మీడియాలో వదులున్నారు.

ఇక మరో సినిమాలో సన్నీ డియోల్‌ మినీ ఫిరంగీ బుజం పై ఎక్కు పెట్టి ఉన్న షాట్‌ తీసుకుని, పాకిస్థాన్‌ కు చెందిన యుద్ద విమానం ఎఫ్‌ 16 ఇండియన్‌ భూ భాగంలోకి వస్తే కాల్చి పారేస్తాడట అంటూ సన్నీ డియోల్‌ పై కామెంట్స్‌ చేస్తున్నారు. సన్నీ డియోల్‌ బీజేపీలో చేరికతో కాంగ్రెస్‌ పార్టీ కంటే ఆ పార్టీ బరువు పెరిగిందని కొందరు, కాంగ్రెస్‌ పార్టీ హస్తం గుర్తు సన్నీ డియోల్‌ హస్తం ముందు దిగ దుడుపే అన్నట్లుగా రకరకాలుగా సన్నీ డియోల్‌ పై ట్రోల్స్‌ నడుస్తున్నాయి.