Begin typing your search above and press return to search.

`ద‌మ్ము` చూపించ‌బోతోన్న స‌ల్లూ భాయ్‌?

By:  Tupaki Desk   |   17 Nov 2017 5:16 PM GMT
`ద‌మ్ము` చూపించ‌బోతోన్న స‌ల్లూ భాయ్‌?
X
బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ హిందీ బిగ్ బాస్ షోకు వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఆ షోను స‌ల్లూభాయ్ త‌న‌దైన శైలిలో ర‌క్తి క‌ట్టిస్తున్నాడు. త్వ‌ర‌లో స‌ల్మాన్ మ‌రో రియాలిటీ షోతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడ‌ని తెలుస్తోంది. 2008లో సోనీ టీవీలో ప్ర‌సార‌మైన 'ద‌స్ కా ద‌మ్' కార్య‌క్ర‌మం త్వ‌ర‌లో పునఃప్రారంభం కాబోతోంది. 2009లో రెండో సీజ‌న్ పూర్తి చేసుకున్న ఈ షో మూడో సీజ‌న్ లో కూడా స‌ల్లూ భాయే హోస్ట్ గా ఫిక్స్ అయ్యాడ‌ని తెలుస్తోంది. ఈ విష‌యాన్ని సోనీ టీవీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ద‌నీష్ ఖాన్ అన‌ధికారికంగా ప్ర‌క‌టించారు. ఆ షోకు హోస్ట్ గా చేసే ద‌మ్ము వేరెవ‌రికీ లేద‌ని ప‌రోక్షంగా వ్యాఖ్యానించారు.

'ద‌స్ కా ద‌మ్' కార్య‌క్ర‌మం వ్యాఖ్యాతగా ఎవ‌రుండ‌బోతున్నార‌ని ద‌నీష్ ఖాన్ ను మీడియా ప్ర‌శ్నించింది. ఆ కార్య‌క్ర‌మానికి యాంకరింగ్ చేయ‌గ‌ల స‌త్తా ఇంకెవ‌రికైనా ఉంద‌ని మీర‌నుకుంటున్నారా అంటూ ఆయ‌న మీడియాకు ఎదురు ప్ర‌శ్న వేశారు. ద‌నీష్ ఖాన్‌ ప‌రోక్షంగా స‌ల్మాన్ వ్యాఖ్యాత అని స‌మాధాన‌మిచ్చాడని మీడియా భావిస్తోంది. సోనీ టీవీలో ప్ర‌సార‌మ‌వుతున్న‌పుడే ప్రేక్ష‌కులు కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనేలా మొబైల్ ఇంట‌రాక్టివ్ టెక్నాల‌జీని ఈసారి అందుబాటులోకి తీసుకురానున్న‌ట్లు ద‌నీష్ ఖాన్ చెప్పారు. 2008లో ప్ర‌సార‌మైన ఈ కార్య‌క్ర‌మంతోనే సోనీ టీవీ త‌న పూర్వ వైభ‌వాన్ని సొంతం చేసుకుంది. ఈ షో త‌ర్వాత సోనీ టీవీ భార‌తీయ టెలివిజ‌న్ ర్యాంకింగ్స్ లో మూడో స్థానానికి చేరుకుంది.