Begin typing your search above and press return to search.

91 కేజీలు..బాన క‌డుపు..కానీ సిక్స‌ర్లే..సిక్స‌ర్లు!

By:  Tupaki Desk   |   26 Sep 2018 5:12 AM GMT
91 కేజీలు..బాన క‌డుపు..కానీ సిక్స‌ర్లే..సిక్స‌ర్లు!
X
అర్థ‌మైందిగా? అయినా.. మీరు చెప్పిన‌ట్లు 91 కేజీల బ‌రువుతో.. పొట్టిగా.. బాన క‌డుపుతో ఉండే వ్య‌క్తి అంత‌ర్జాతీయ క్రికెట్ ఆడ‌గ‌ల‌డా? క్రికెట‌ర్ అంటే ఎలా ఉండాలి? ఎంత ఫిట్ నెస్ అవ‌స‌రం? లాంటి ప్ర‌శ్న‌ల‌కు ఏ మాత్రం సూట్ కాని ఆహార్యంతో ఉండే క్రికెట‌ర్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాడు. భార‌త క్రికెట్ క్రీడాభిమానుల‌కు అత‌డిప్పుడో ఫ‌జిల్‌.ఇంత‌కీ అత‌ను ఎవ‌రంటారా? అప్ఘ‌నిస్థాన్ కు చెందిన మ‌హ్మ‌ద్ షెహ‌జాద్‌.

మొన్న‌టి వ‌ర‌కూ ఎవ‌రి దృష్టిని పెద్ద‌గా ఆక‌ర్షించ‌ని ఇత‌గాడు.. ఇప్పుడో హాట్ టాపిక్. ఆ మాట‌కు వ‌స్తే.. ఆఫ్ఘ‌నిస్తాన్ లాంటి పిల్ల జ‌ట్టు.. టీమిండియాతో మ్యాచ్ ను టై చేసుకుందంటే అత‌గాడే కీల‌కం. ఇంత‌కీ ఇత‌గాడి స్పెష‌ల్ ఏమిటంటారా?.. క్రీజ్ లోకి అడుగు పెట్టిన ఇత‌గాడ్ని చూస్తే.. ఎంత‌టోళ్లు అయినా అండ‌ర్ ఎస్టిమేట్ చేయాల్సిందే. పొట్టిగా.. ముందుకు త‌న్నుకొచ్చే పొట్ట‌తో.. అస‌లు క‌ద‌ల‌గ‌ల‌డా? అన్న సందేహాన్ని క‌లిగించేలా ఉన్నా.. బ్యాట్ ఝుళిపించాడంటే చాలు.. ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌కు చుక్క‌లు క‌నిపించాల్సిందే.

తాజాగా జ‌రిగిన ఆసియా క‌ప్ మ్యాచ్ లో అత‌గాడి బ్యాటింగ్ విన్యాసంతో ఓవ‌ర్ నైట్ సంచ‌ల‌నంగా మారిపోయాడు. భార‌త్ తో జ‌రిగిన మ్యాచ్ లో సిక్స‌ర్ల మీద సిక్స‌ర్లు కొట్ట‌ట‌మే కాదు.. సింగిల్స్ కోసం వికెట్ల మ‌ధ్య చురుగ్గా క‌దిలిన తీరుతో అవాక్కు అయ్యే ప‌రిస్థితి. 91 కేజీల బ‌రువుతో.. ఊగిపోతున్న పొట్టను వేసుకొని.. అల‌వోక‌గా సిక్సుల మీద సిక్సులు బాదేయ‌ట‌మే కాదు.. కోహ్లీ కంటే ఎక్కువ దూరం సిక్స‌ర్లు కొట్టే స‌త్తా త‌న‌లో ఉంద‌న్న విశ్వాసాన్ని క‌లిగించిన ఈ క్రికెట‌ర్ కు మిస్ట‌ర్ కూల్ ఎంఎస్ ధోనీ అంటే చాలా ఇష్టం.

అదెంతంటే.. త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఎంఎస్ అన్న అక్ష‌రాల్ని త‌న పేరు ముందు పెట్టుకునేంత‌. ఇత‌గాడి ప‌రుగుల జోరు ఎంత‌లా ఉంటుందంటే.. అత‌డు అర్థ సెంచ‌రీ సాధించే టైంకి అప్ఘ‌నిస్థాన్ జ‌ట్టు స్కోర్ 57 ప‌రుగులే. అంటే.. అత‌డి 50 ప‌రుగులు కాకుండా.. మ‌రో బ్యాట్స్ మ‌న్ చేసింది ఏడు ప‌రుగులే. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ధోనీ మాదిరి హెలికాఫ్ట‌ర్ షాట్లు కొట్ట‌టం అంటే చాలా ఇష్టంగా చెబుతారు. తాజా మ్యాచ్ లో 88 బంతుల్లో సెంచ‌రీ బాదేసిన ఇత‌గాడు ఇప్పుడో అర్థం కాని ఫ‌జిల్ గా మారాడ‌ని చెప్పాలి. ఆప్ఘ‌నిస్థాన్ బ్యాట్స‌మ‌న్లు భార‌త స్పిన్ ను ఎదుర్కోవ‌టానికి కిందామీదా ప‌డుతుంటే.. ఇత‌గాడు మాత్రం శివాలెత్తిపోయిన‌ట్లుగా సిక్స‌ర్లు బాదేయ‌టం విశేషం.