Begin typing your search above and press return to search.

అద్వానీకి చిక్కులు త‌ప్ప‌వా?

By:  Tupaki Desk   |   25 May 2017 7:28 AM GMT
అద్వానీకి చిక్కులు త‌ప్ప‌వా?
X
చట్టం చాలా క‌రుకైన‌ది. ఒక‌సారి కానీ చ‌ట్టం ప‌రిధిలోకి వెళితే.. ఎప్ప‌టికైనా స‌మ‌స్య‌లు త‌ప్ప‌వు. అప్పుడెప్పుడో వివాదాస్ప‌ద క‌ట్టడం కూల్చివేత కేసు బీజేపీ కురువృద్ధుడు అద్వానీ మెడ‌కు చుట్టుకోనుందా? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ కేసులో ప్ర‌ధాన‌నిందితుడైన ఆయ‌న‌పై ల‌క్నోలోని సీబీఐ ప్ర‌త్యేక న్యాయ‌స్థానం శుక్ర‌వారం మ‌రిన్ని అభియోగాలు న‌మోదు చేసే అవ‌కాశం ఉంద‌న్న మాట చెబుతున్నారు.

ఈ ఉదంతంలో అద్వానీతో పాటు బీజేపీ నేత‌లు ముర‌ళీమ‌నోహ‌ర్ జోషి.. ఉమాభార‌తి త‌దిత‌రులు మీద కూడా స‌రికొత్త అభియోగాలు మోపే అవ‌కాశం ఉంద‌ని చెబుత‌న్నారు.

వివాదాస్ప‌ద క‌ట్ట‌డం కూల్చివేత‌కు సంబంధించిన కుట్ర ఆరోప‌ణ‌ల్ని 2011లో అల‌హాబాద్ హైకోర్టు కొట్టేసింది. అయితే.. ఈ కేసును గ‌త నెల‌లో సుప్రీంకోర్టు తిర‌గ‌తోడ‌టంతో ఇప్పుడీ వ్య‌వ‌హారం కొత్త మ‌లుపు తిరిగిన‌ట్లైంది. దాదాపు ఆరేళ్ల కింద‌ట కింది కోర్టు కొట్టేసిన కేసును తిరిగి తెరిచిన కార‌ణంగా.. తాజాగా ఈ వ్య‌వ‌హారం ఏ మ‌లుపు తిరుగుతుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

సీబీఐ దాఖ‌లు చేసిన పిటీష‌న్‌ ను సుప్రీంకోర్టు విచారిస్తూ.. ఈ కేసులో వాద‌న‌లు ప్ర‌తి రోజూ వినాల‌ని.. విచార‌ణ‌ను నెల రోజుల్లో మొద‌లెట్టి.. రెండేళ్ల లోపు ముగించాలంటూ సీబీఐ ప్ర‌త్యేక న్యాయ‌స్థానాన్ని ఆదేశించింది. ఇదిలా ఉంటే.. ఈ కేసులో ఆరో నిందితుడైన శివ‌సేన మాజీ ఎంపీ స‌తీశ్ ప్ర‌ధాన్‌ కు సీబీఐ ప్ర‌త్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తాజా ప‌రిణామాలు బీజేపీ కురువృద్ధుడికి చిక్కులు తెచ్చేలా ఉన్నాయ‌న్న వాద‌న వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/