ఆస్ట్రేలియా జట్టులో ‘గే’క్రికెటర్లు

Mon Mar 25 2019 11:42:30 GMT+0530 (IST)

ఇప్పుడు ప్రపంచ క్రికెట్ లో ఒక వీడియో సంచలనంగా మారింది. ఇద్దరు స్టార్ క్రికెటర్లు చేసిన పని చూశాక యావత్ క్రికెట్ అభిమానులు అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఇద్దరు క్రికెటర్లు ‘గే’లు అంటూ ఆడిపోసుకుంటున్నారు. ఇంతకీ ఆ ఇద్దరు క్రికెటర్లు ఎవరు? ఏం చేశారు? ఎందుకలా వారిని ‘గే’లు అంటున్నారో చూద్దాం.ప్రస్తుతం అందరి చూపు దేశంలో జరుగుతున్న ఐపీఎల్ పైనే ఉంది. కానీ పక్కనే దుబాయ్ లో ఆస్ట్రేలియా-పాకిస్తాన్ వన్డే సిరీస్ జరుగుతోంది. శుక్రవారం రెండు జట్ల మధ్య తొలి వన్డే జరగగా.. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియానే గెలిచింది. అయితే ఆస్ట్రేలియా బ్యాంటింగ్ చేస్తున్న సమయంలో డ్రెస్సింగ్ రూంలో ఇద్దరు ఆస్ట్రేలియా క్రికెటర్లు చేసిన పని అందరినీ ఆశ్చర్యపరిచింది.

డ్రెస్సింగ్ రూంలో బాల్కనీలో ఆల్ రౌండర్ మార్కస్ స్టాయినిస్ స్పిన్నర్ ఆడమ్ జంపాలు పక్కపక్కనే కూర్చొని సిగ్నల్స్ ఇచ్చుకుంటూ శరీరాలను తాకిస్తూ స్పర్శను ఎంజాయ్ చేస్తూ.. చెంప చెవిపై నిమురుకుంటూ పరవశంలో మునిగిపోయారు. జంపా చేతిని స్టాయినిస్ ముద్దాడినట్లు కనిపించాడు. వీరి బాగోతం అంతా స్టేడియంలోని కెమెరాల్లో రికార్డు కావడం.. ఆ వీడియో వైరల్ కావడంతో వీరిద్దరి పరువు పోయింది.

ఈ వీడియో ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో దుమారం రేపుతోంది. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో స్టాయినిస్ జంపాలు ‘గే’లు అని.. వీరి చేష్టలు చూస్తుంటే స్వలింగ సంపర్కులు అనిపిస్తోందని చాలా మంది వీడియోలను షేక్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. స్టాయినిస్ జంపా రోమాంటిక్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ఆ ఇద్దరు క్రికెటర్లు కానీ.. ఆస్ట్రేలియా జట్టు కానీ అధికారికంగా స్పందించలేదు.

For Video Click Here