Begin typing your search above and press return to search.

బెజ‌వాడ‌లో వ‌ర్థ‌మాన న‌టిపై లైంగిక వేధింపులు

By:  Tupaki Desk   |   16 Aug 2017 6:14 AM GMT
బెజ‌వాడ‌లో వ‌ర్థ‌మాన న‌టిపై లైంగిక వేధింపులు
X
ఒక వ‌ర్ద‌మాన‌ న‌టిని లైంగిక వేధింపుల‌కు గురి చేసిన ఉదంతం తాజాగా బ‌య‌టకు వ‌చ్చింది. సినిమాలో అవ‌కాశం కోసం హైద‌రాబాద్‌కు పిలిచిన వ‌ర్ద‌మాన‌ ద‌ర్శ‌కుడు.. మ‌రో వ‌ర్ద‌మాన‌ హీరో న‌టిపై లైంగిక దాడికి య‌త్నించారు. అదృష్ట‌వ‌శాత్తు ఆమె వారి నుంచి బ‌య‌ట‌ప‌డింది.

సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఇస్తామ‌న్న ఆశ క‌ల్పిస్తూ హైద‌రాబాద్‌కు చెందిన ద‌ర్శ‌కుడు చ‌ల‌ప‌తి.. హీరోగా చెప్పుకునే సుజ‌న్ లు ఒక కొత్త న‌టిని న‌గ‌రం నుంచి షూటింగ్ కోస‌మ‌ని చెప్పి భీమ‌వ‌రం తీసుకెళ్లారు. ఈ ప్ర‌యాణం కోసం స‌ద‌రు న‌టి కారునే వినియోగించ‌టం విశేషం.

హైద‌రాబాద్ నుంచి కారులో బ‌య‌లుదేర‌గా.. చ‌ల‌ప‌తి డ్రైవింగ్ చేశాడు. మొద‌ట్లో బాగానే ఉన్నా విజ‌య‌వాడ వ‌ద్ద త‌న ప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని స‌ద‌రు న‌టి ఆరోపిస్తున్నారు. ఎందుకిలా చేస్తున్నారంటూ తాను అడిగినందుకు త‌న‌ను కొట్టార‌ని వాపోయింది.

తాను కారులో నుంచి దూకేస్తాన‌న్న ఉద్దేశంతో త‌న‌ను వెన‌క‌సీట్లో ప‌డేశార‌ని చెప్పింది. ఈ ఘ‌ర్ష‌ణ స‌మ‌యంలోనే కారు లారీని ఢీ కొంద‌ని పేర్కొంది. కారు బాగా డ్యామేజ్ అయ్యింద‌ని చెప్పింది. ప్ర‌మాదం అనంత‌రం గాయాలు కావ‌టంతో ఆమె ప్రైవేటు ఆసుప‌త్రిలో చేరారు. జ‌రిగిన దారుణం గురించి హైద‌రాబాద్ లోని త‌న కుటుంబ స‌భ్యుల‌కు తెలియ‌జేయ‌టంతో వారు హుటాహుటిన బ‌య‌లుదేరి వ‌చ్చారు.

న‌టి ప‌ట్ల అస‌భ్యంగా వ్య‌వ‌హ‌రించిన వైనం గురించి కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసిన ఆమె ప‌డ‌మ‌ట పోలీస్ స్టేష‌న్లో ఫిర్యాదు చేశారు. ఆమె ప‌ట్ల దారుణంగా వ్య‌వ‌హ‌రించిన వర్ద‌మాన ద‌ర్శ‌కుడు చ‌ల‌ప‌తిని పోలీసులు అదుపులోకి తీసున్నారు. న‌టుడు సృజ‌న్ కోసం గాలిస్తున్నారు. ప్ర‌స్తుతం అతడు ప‌రారీలో ఉన్న‌ట్లు పోలీసులు చెబుతున్నారు. అవ‌కాశాలు ఇస్తామ‌ని చెప్పి ఇలా దారుణంగా వ్య‌వ‌హ‌రించే చెత్త వెధ‌వ‌ల్ని పోలీసులు వ‌ద‌ల‌కూడ‌ద‌ని.. క‌ఠినంగా శిక్షించాల‌ని బాధితురాలు.. త‌న‌కు న్యాయం చేయాల‌ని కోరుకుంటోంది.