Begin typing your search above and press return to search.

అగ్నివేశ్‌ పై దాడి.. కాళ్ల‌తో త‌న్ని చెంప‌దెబ్బ‌లు

By:  Tupaki Desk   |   18 July 2018 4:35 AM GMT
అగ్నివేశ్‌ పై దాడి.. కాళ్ల‌తో త‌న్ని చెంప‌దెబ్బ‌లు
X
జార్ఖండ్‌ లో ఊహించ‌ని ప‌రిణామం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ సామాజిక కార్య‌క‌ర్త 79 ఏళ్ల స్వామి అగ్నివేశ్‌ పై అల్ల‌రిమూక ఒక‌టి దాడి చేసింది. దారుణ‌మైన రీతిలో ఆయ‌న‌పై భౌతిక‌దాడికి పాల్ప‌డింది. కాళ్ల‌తో త‌న్న‌టం.. చెంప దెబ్బ‌లు కొట్ట‌టం లాంటి ప‌నులు చేశారు. ఓవైపు భౌతిక‌దాడి చేస్తూనే మ‌రోవైపు నోటికి వ‌చ్చిన‌ట్లుగా తిట్ల దండ‌కం అందుకున్న తీరును ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు.

ఏబీవీపీ.. బీజేవైఎం కార్య‌క‌ర్త‌లే ఈ ప‌నికి పాల్ప‌డి ఉంటార‌ని భావిస్తున్నారు. స్వామి అగ్నివేశ్ సైతం ఇదే ఆరోప‌ణ‌ను చేస్తున్నారు. జార్ఖండ్ లోని పాకుర్ లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడి బ‌య‌ట‌కు వ‌చ్చిన అనంత‌రం ఆయ‌పై దాడి జ‌రిగింది.

అగ్నివేశ్‌పై దాడికి పాల్ప‌డిన వారంతా దాడి అనంత‌రం.. దేశంలో జీవించాలంటే వందేమాత‌రం అనాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు. ఇదే తీరులో నినాదాలు చేశారు. దాడికి గురైన అగ్నివేశ్‌ను పాకుడ్‌లోని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఉదంతంపై జార్ఖండ్ ముఖ్య‌మంత్రి ర‌ఘువ‌ర్ దాస్ ద‌ర్యాప్తున‌కు ఆదేశించారు.

గిరిజ‌నుల స‌ద‌స్సులో పాల్గొనేందుకు వ‌చ్చిన అగ్నివేశ్ పై దాడి చేశారు. గిరిజ‌నుల‌ను ప్ర‌భుత్వం నిరాశ్ర‌యుల్ని చేస్తోంద‌ని.. వారి భూమిని లాక్కొని కార్పొరేట్ సంస్థ‌ల‌కు ధారాద‌త్తం చేస్తోంద‌ని దుయ్య‌బ‌ట్టారు. ఇదిలా ఉంటే.. అగ్నివేశ్ పై దాడి ప‌థ‌కం ప్ర‌కార‌మే జ‌రిగింద‌ని.. అంత‌మంది అల్ల‌రిమూక అక్క‌డ ఉంటే.. పోలీసుల‌కు ఆ మాత్రం స‌మాచారం అంద‌కుండా ఉంటుందా? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే.. త‌న‌పై దాడికి పాల్ప‌డింది ఏబీవీపీ.. బీజేవైం కార్య‌క‌ర్త‌లేన‌న్న అగ్నివేశ్ ఆరోప‌ణ‌ల్ని బీజేపీ నేత‌లు ఖండిస్తున్నారు.