Begin typing your search above and press return to search.

చాందినిని చంపాక వాడేం చేశాడో తెలుసా?

By:  Tupaki Desk   |   14 Sep 2017 5:56 AM GMT
చాందినిని చంపాక వాడేం చేశాడో తెలుసా?
X
మీసాలు స‌రిగా మొల‌వ‌ని వ‌య‌సు. రికార్డుల ప్ర‌కారం 17ఏళ్లు మాత్ర‌మే. అంటే.. చ‌ట్ట‌ప్ర‌కారం మైన‌ర్‌. కానీ.. అత‌డి తీరు చూస్తే.. పోలీసుల‌కు సైతం షాక్ త‌గిలింది. చిన్న త‌ప్పు చేస్తేనే వ‌ణికిపోయే దానికి భిన్నంగా హ‌త్య చేసేసి కూడా కూల్ గా.. ఎలాంటి భ‌యం లేకుండా పోలీసుల‌కే మ‌స్కా కొట్టేసిన వైనం పోలీసు వ‌ర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు చెప్పిందంతా సంచ‌ల‌నం సృష్టించిన చాందిని హ‌త్య కేసులో నిందితుడి గురించే.

చ‌ట్ట‌ప్ర‌కారం పేరు చెప్ప‌లేని నేప‌థ్యంలో అత‌గాడి పేరును "ఎక్స్" గా పిలుచుకుందాం. త‌న గాళ్ ఫ్రెండ్ ను హ‌త్య చేసిన అత‌ను ఇంటికి వ‌చ్చి మామూలుగా త‌న‌కెంతో ఇస్ట‌మైన ఎస్కోబార్ వెబ్ సీరిస్ ను చూశాడు.

ఎక్స్‌ కు.. ఎస్కోబార్ వెబ్ సిరీస్ అంటూ చాలా..చాలా ఇష్టం. ఇంత‌కీ ఎస్కోబార్ వెబ్ సిరీస్ కంటెంట్ ఏమిటంటే.. 1993లో చ‌నిపోయిన కొలంబియ‌న్ డ్ర‌గ్స్ కింగ్‌. ఈ డాన్ జీవితాన్ని నెట్ ఫ్లిక్స్ అనే సంస్థ రూపొందిస్తే.. దాన్ని నార్కోస్ అనే పేరుతో సీరియల్‌ గా ప్ర‌సారం చేస్తోంది. ఈ క్రైం సీరియ‌ల్‌ ను ప్ర‌సారం చేయ‌టానికి అమెరిక‌న్ ఛాన‌ళ్లు నో చెప్ప‌టంతో దీన్ని. .వెబ్ సిరీస్ గా రిలీజ్ చేశారు. దీని రేటింగ్ చూస్తే మెంట‌లెక్కాల్సిందే. అస్కార్ అవార్డు సినిమాల‌కు డ‌బుల్ రేటింగ్ ఉండే ఈ సిరీస్ ను ఎక్స్ చాలా ఇష్టంగా రోజూ చూసేవాడు.

ఈ క్రైం సీరియ‌ల్ ప్ర‌భావంతో ఎలాంటి ఆయుధం లేకుండా.. చేతుల‌తోనే చాందినిని హ‌త్య చేసిన వైనం విన్న పోలీసులు సైతం షాక్ తిన్నార‌ని తెలుస్తోంది. చాందినిని హ‌త్య చేసిన త‌ర్వాత ఇంటికి కూల్ గా వెళ్లి.. త‌న ల్యాప్ టాప్ లో ఎప్ప‌టిమాదిరే క్రైం సీరియ‌ల్ ను చూశాడు. గుర్తు తెలియ‌ని మృత‌దేహాన్ని చాందినిదిగా గుర్తించిన త‌ర్వాత అనుమానితుల జాబితాను పోలీసులు త‌యారు చేయ‌గా.. అందులో ఎక్స్ ఒక‌డు.

తొలుత సీసీ టీవీ పుటేజ్ ను ప‌రిశీలించిన పోలీసులు చాందినితో వెళుతున్న‌ది ఎక్స్ గా గుర్తించారు. అయితే.. అంద‌రితో పాటే ఎక్స్ ను విచారించిన‌ప్పుడు పోలీసుల ప్ర‌శ్న‌ల‌కు ఎలాంటి జంకూ లేకుండా కూల్ గా అబ‌ద్ధాల మీద అబ‌ద్ధాలు చెప్పేశాడు. హ‌త్య జ‌రిగిన రోజు తాను క్రికెట్ ఆడాన‌ని చెప్పాడు. ఎవ‌రితో ఆడావ్‌? ఎక్క‌డ ఆడావ్? అన్న ప్ర‌శ్న‌ల‌కు సైతం గ‌తుక్కుమ‌న‌కుండా స‌మాధానాలు చెప్పేశాడ‌ట‌. అంతేనా.. ఇంట్లో ఎస్కోబార్ సీరియ‌ల్‌.. టీవీలో ప్రో క‌బ‌డ్డీ మ్యాచ్ చూసిన‌ట్లుగా చెప్పాడ‌ట‌. క‌బ‌డ్డి ఆడిన జ‌ట్టు పేరు చెప్ప‌టంతో పాటు.. తాను క్రికెట్ ఆడిన‌ట్లుగా గ్రౌండ్‌ ను చూపించ‌టం.. లాంటివి చేశాడు.

అయితే.. ఎక్స్ మైండ్ గేమ్ ను పోలీసులు తెలివిగా ఛేదించ‌టంతో చివ‌ర‌కు త‌న ప‌ప్పులు ఉడ‌క‌వ‌న్న విష‌యాన్ని అర్థం చేసుకొని చేసిన హ‌త్య‌ను వివ‌రంగా చెప్పేశాడ‌ట‌. తాను చాందినిని ఎందుకు హ‌త్య చేశాన‌న్న విష‌యంపై అత‌గాడు బ‌య‌ట‌పెట్టిన వివ‌రాల్ని పోలీసుల ద‌ర్యాప్తు చేస్తున్నారు. మైన‌ర్ గా ఉన్న ఒక కుర్రాడు త‌న గాళ్ ఫ్రెండ్‌ ను హ‌త్య చేసి మ‌రీ.. కూల్ గా వ్య‌వ‌హ‌రించిన తీరు మాత్రం ఇప్పుడు షాకింగ్ గా మారిందంటున్నారు.