Begin typing your search above and press return to search.

అమెరికాలో ‘అబార్షన్’ ల ఉద్యమం

By:  Tupaki Desk   |   22 May 2019 8:41 AM GMT
అమెరికాలో ‘అబార్షన్’ ల ఉద్యమం
X
అమెరికాలో ఇప్పుడు కొత్త రకం ఉద్యమం ప్రారంభమైంది. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో అబార్షన్ (గర్భస్రావం)ను నిషేధించడాన్ని వ్యతిరేకిస్తూ మహిళలు దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అబర్షన్ లపై నిషేధించాలని తొలగించాలని మహిళలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు..

*ఎందుకు మొదలైందీ ఉద్యమం..
అమెరికాలోని అలబామా రాష్ట్రం సహా మరో నాలుగు రాష్ట్రాల్లో జనాభా పడిపోతోంది. చాలా మంది నవతరం యువత పిల్లలు కనడానికి ఇష్టపడడం లేదు.. డేటింగ్ లు, విడిపోవడాలు చేస్తూ పిల్లలను కనడానికి ముందుకురావడం లేదట. దీంతో అమెరికాలోని ఆయా రాష్ట్రాల్లో పిల్లల జనాభా దారుణంగా పడిపోయింది. ఇది సమతుల్యతను దెబ్బ తీస్తోందని భావించిన అలబామా రాష్ట్ర ప్రభుత్వం‘మహిళల అబార్షన్ ’లపై నిషేధం విధించారు. ఎవరైనా డాక్టర్లు అబార్షన్ లు చేస్తే వారికి 99 ఏళ్ల వరకు శిక్ష విధించాలని నిర్ణయించారు. కేవలం తల్లికి ప్రమాదం ఉందన్న కేసుల్లో మాత్రమే అబార్షన్ చేయాలని సూచించారు. రేప్ బాధితులకు అబార్షన్ చేయరాదని నిబంధన విధించారు. మరో నాలుగు రాష్ట్రాలు కూడా ఇదే నిర్ణయం తీసుకున్నాయి. దీన్ని దశల వారీగా అన్ని రాష్ట్రాలు విస్తరిస్తున్నాయి.

*మహిళల ఆందోళనలు ఎందుకు.?
ఆబార్షన్ ల నిషేధంపై మహిళల నుంచి నిరసన వ్యక్తం అవతుండడం విశేషం. అబార్షన్ లను నిషేధిస్తూ చేస్తున్న చట్టాలను మీటూ యాక్టివిస్ట్ లు సినిమా నటీనటులు, హీరోయిన్లు , మహిళలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉద్యమం మొదలు పెట్టారు. అలబామా ప్రభుత్వం మొదలుపెట్టిన ఈ అబార్షన్ ల పై నిషేధాన్ని వ్యతిరేకించారు. ఈ చట్టం మహిళల హక్కులను ఉల్లంఘించడమేనని ఆమె నిరసించారు. 1973లో రూపొందించిన అబార్షన్ ల చట్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టిందని మహిళలు ఆరోపిస్తున్నారు. తమ శరీరాలపై తమకు హక్కులు లేకుండా చేయడం ఏంటని ప్రశ్నించారు. ఈ ఉద్యమానికి మద్దతుగా చాలా మంది మహిళలు వచ్చి సపోర్ట్ చేశారు. వీరంతా కలిసి తాజాగా అబార్షన్లపై నిషేధాన్ని ఎత్తివేసే వరకూ సెక్స్ స్ట్రైక్ చేయాలని నిర్ణయించారు.

*బిల్లు సుప్రీంలో పెండింగ్.. ట్రంప్ నిర్ణయమేంటి?
అయితే అలబామాలో మొదలైన ఈ అబార్షన్ నిషేధ చట్టం వివాదాస్పదం కావడంతో సుప్రీంకోర్టు స్వీకరించింది. ఇది ప్రస్తుతం పరిశీలనలో ఉంది. దీనిపై తుదితీర్పును వెలువరించాల్సి ఉంది. అయితే ఈ అబార్షన్ చట్టాన్ని ఎత్తివేస్తామని ఎన్నికల సమయంలో ట్రంప్ హామీ ఇచ్చారు. ట్రంప్ హామీకి వ్యతిరేకంగా ఇప్పుడు పలు రాష్ట్రాలు చట్టాన్ని రూపొందించడం సంచలనంగా మారింది. దీనిపై సుప్రీం కోర్టు , ట్రంప్ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుదనే దానిపై అమెరికా వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.