Begin typing your search above and press return to search.

ఈ బ‌స్సెక్కితే గంట‌న్న‌ర‌లో శ్రీ‌వారి ద‌ర్శ‌నం

By:  Tupaki Desk   |   13 Jun 2018 6:09 AM GMT
ఈ బ‌స్సెక్కితే గంట‌న్న‌ర‌లో శ్రీ‌వారి ద‌ర్శ‌నం
X
తిరుప‌తి మొక్కు తీర్చుకోవాలంటే ఏడుకొండ‌ల వాడి ద‌య ఉండాలి. అక్క‌డ వ‌స‌తి కావాల‌న్నా ఇబ్బందే. వేస‌విలో ఈ ఇబ్బందులు మ‌రీ అధికం. అన్ని ఇబ్బందులు ఓర్చుకుని అంత‌దూరం వెళ్లినా ఎప్పుడు శ్రీ‌వారి ద‌ర్శ‌న‌భాగ్యం క‌లుగుతుందో తెలియ‌దు. ద‌ర్శ‌నానికి గంట‌ల త‌ర‌బ‌డి పిల్ల‌లు - వృద్దుల‌తో నిల‌బ‌డి న‌రకం అనుభ‌విస్తుంటాం. అందుకే వెన‌క‌టికి త‌మ ద‌గ్గ‌ర‌లో ఉండే వెంక‌టేశ్వ‌ర స్వామి దేవాల‌యాలను ద‌ర్శించుకుని భ‌క్తులు శ్రీ‌వారి మొక్కు తీర్చుకుంటారు. తెలుగు రాష్ట్రాల‌లో చాలా చోట్ల అనేక దేవాల‌యాల‌ను చిన్న తిరుప‌తి అని పిలుచుకుంటారు. అయితే విశాఖ వాసుల‌కు శ్రీ‌వారి ద‌ర్శనానికి ఇక ఇక్క‌ట్లు త‌ప్పిన‌ట్లే.

విశాఖ నుంచి తిరుమలకు వెళ్లే యాత్రికుల కోసం ఏపీటీడీసీ ప్రత్యేక ప్యాకేజీ అమలు చేయనున్నది. రద్దీతో పనిలేకుండా గంట నుంచి గంటన్నర వ్యవధిలోనే వేంకటేశ్వరుని దర్శనం చేయించే సదుపాయం క‌ల్పిస్తున్నారు. ఈ ప్రతిపాదనలు ఈ నెలాఖరులోగా అమలులోకి తీసుకురానున్నారు. రెండు ఓల్వో బ‌స్సుల‌ను విశాఖ‌కు కేటాయించ‌గా ఈ నెలాఖ‌రు నుండి ఒక బ‌స్ విశాఖ నుండి రాక‌పోక‌లు ప్రారంభించ‌నుంది.

ఇదీ ప్యాకేజీ

విశాఖప‌ట్నం నుండి ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటలకు బస్సు బయలుదేరుతుంది. మరుసటి రోజు తిరుపతికి చేరుకుంటుంది. ప్రయాణికులకు తిరుపతిలోనే వసతి కల్పిస్తారు. తిరుపతి నుంచి తిరుమలకు ఆర్టీసీ బస్సులో తీసుకెళ్లి దర్శనం కల్పించి వెనక్కు తీసుకువస్తారు. అదే రోజు మధ్యాహ్నం తిరుపతిలో బయలుదేరి శ్రీకాళహస్తిలో దర్శనం కల్పిస్తారు. ఆ మరుసటి రోజు ఉదయం విశాఖప‌ట్నానికి బస్‌ చేరుకుంటుంది. మూడు రోజుల ఈ ట్రిప్ కు రూ.4 వేలు వ‌సూలు చేయ‌నున్నారు. మూడురోజుల టూర్‌ కు సంబంధించి ఒకరికి నాలుగువేల రూపాయలతో ప్యాకేజీ రూపొందించారు. మొత్తం 43 సీట్లు ఇందులో ఉంటాయి. ఉన్న‌తాధికారుల ఆమోదం కోసం ఫైలు ఎదురుచూస్తున్న‌ట్లు విశాఖ పర్యాటకాభివృద్ధి సంస్థ విశాఖ డివిజనల్‌ మేనేజర్‌ టి.గిరిప్రసాదరెడ్డి తెలిపారు.