Begin typing your search above and press return to search.

​ఎ​న్నాళ్ల‌కెన్నాళ్ల‌కు:ప్ర‌త్యేక గ‌ళం విప్పిన వెంక‌య్య‌!

By:  Tupaki Desk   |   27 Nov 2015 7:55 AM GMT
​ఎ​న్నాళ్ల‌కెన్నాళ్ల‌కు:ప్ర‌త్యేక గ‌ళం విప్పిన వెంక‌య్య‌!
X
పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాల్లోనే.. అంబేడ్క‌ర్ జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌త్యేక చ‌ర్చ‌ను చేపట్టిన సంగ‌తి తెలిసిందే. గురువారం నుంచి సాగుతున్న ఈ చ‌ర్చ‌లో భాగంగా ప‌లువురు నేత‌లు ప్ర‌సంగించారు. ఈ రోజు (శుక్ర‌వారం) కేంద్ర‌మంత్రి వెంక‌య్య ప్ర‌సంగిస్తున్నారు. త‌న ప్ర‌సంగంలో భాగంగా వెంక‌య్య ఏపీకి ప్ర‌త్యేక హోదా అంశాన్ని ప్ర‌స్తావించారు. ఏపీ విభ‌జ‌న సంద‌ర్భంగా ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని నాటి ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ చెప్ప‌టం.. త‌ర్వాత ఎన్నిక‌ల్లో ఎన్డీయే స‌ర్కారు అధికారంలోకి రావ‌టం తెలిసిందే.

ప్ర‌భుత్వం ఏర్ప‌డి 18 నెల‌లు పూర్తి అవుతున్నా.. ఏపీకి ప్ర‌త్యేక హోదా గురించి ప్ర‌స్తావిస్తున్న‌దే లేదు. ఈ అంశంపై ఇప్ప‌టికే ప‌లు నిర‌స‌న‌లు.. ఆందోళ‌న‌లు చోటు చేసుకున్నాయి. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి శంకుస్థాప‌న సంద‌ర్భంగా హాజ‌రైన ప్ర‌ధాని మోడీ సైతం.. ప్ర‌త్యేక హోదా గురించి కానీ.. ఏపీ రాజ‌ధానికి ఇచ్చే నిధుల గురించి కానీ ప్ర‌స్తావించింది లేదు. దీనిపై ఏపీలో తీవ్ర ఆగ్ర‌హావేశాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా కేంద్ర‌మంత్రి వెంక‌య్య ఏపీకి ప్ర‌త్యేక హోదా అంశాన్ని లోక్ స‌భ‌లో ప్ర‌స్తావించారు.

ప్ర‌ధాని మోడీ స‌భ‌లో ఉన్న స‌మ‌యంలో.. కీల‌క‌మైన ఏపీకి ప్ర‌త్యేక హోదా గురించి ప్ర‌స్తావించ‌టం.. పంజాబ్ తో స‌హా ప‌లు రాష్ట్రాలు ప్ర‌త్యేక హోదా గురించి డిమాండ్ చేస్తున్నాయ‌ని చెప్పారు. విభ‌జ‌న కార‌ణంగా ఏపీకి రెవెన్యూలోటు ఏర్ప‌డ‌టంతో ప్ర‌త్యేక హోదాను అక్క‌డి ప్ర‌జ‌లు అడుగుతున్నార‌ని.. కానీ.. అభివృద్ధి చెందిన రాష్ట్రాలు కూడా ప్ర‌త్యేక హోదా గురించి డిమాండ్ చేయ‌ట‌మేమిట‌ని ప్ర‌శ్నించారు. దేశ స‌మ‌గ్ర‌త‌.. సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాలు బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించాల‌ని వెంక‌య్య కోరారు. తాజాగా వెంక‌య్య మాట‌లు చూస్తే.. ఏపీకి ప్ర‌త్యేక హోదా అంశాన్ని క‌ద‌ప‌ట‌మే కాదు.. ఏపీ వాద‌న‌లోని న్యాయాన్ని ఆయ‌న తెర‌పైకి తీసుకొచ్చిన‌ట్లైంది. ఇప్ప‌టివ‌ర‌కూ ప్ర‌త్యేక‌హోదా మీద వెంక‌య్య సానుకూలంగా స్పందించ‌టం లేద‌న్న విమ‌ర్శ‌ల్ని.. త‌న తాజా ప్ర‌స్తావ‌న ద్వారా అలాంటిదేమీ లేద‌న్న భావ‌న క‌లిగించ‌టంలో స‌క్సెస్ అయిన‌ట్లుగా చెప్పొచ్చు. మ‌రి.. వెంక‌య్య మాట‌ల్ని.. ప్ర‌ధాని త‌న ప్ర‌సంగంలో ప్ర‌స్తావిస్తారా? లేదా? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.