Begin typing your search above and press return to search.

1107 జీవోతో ..ఐదున్న‌రేళ్ల దీక్ష‌లు ఆగాయి

By:  Tupaki Desk   |   29 Aug 2015 1:06 PM GMT
1107 జీవోతో ..ఐదున్న‌రేళ్ల దీక్ష‌లు ఆగాయి
X
శ్రీకాకుళం జిల్లాలో అత్యంత వివాదాస్ప‌దంగా ఉన్న సోంపేట థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్లాంట్‌ ను ర‌ద్దు చేస్తూ ఏపీ కేబినెట్ నిర్ణ‌యం తీసుకుంది. శ‌నివారం విజ‌య‌వాడ‌లో సీఎం చంద్ర‌బాబు నాయుడు అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన స‌మావేశంలో ఈ మేర‌కు తీర్మానించారు. ఈ ప్లాంట్ ఏర్పాటుకు అప్ప‌టి కాంగ్రెస్ ప్ర‌భుత్వం 2008లో 972 ఎక‌రాల‌ను కేటియిస్తూ జీవో నెంబర్ 1107ను జారీ చేసింది. అయితే చంద్ర‌బాబు ఎన్నిక‌ల‌కు ముందు శ్రీకాకుళం జిల్లాలో ప‌ర్య‌టించిన‌ప్పుడు ఇచ్చిన హామీ మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ ప్లాంట్ ఏర్పాటుకు ఏపీఐఐసీ కేటాయించిన 972 ఎకరాల భూమిలో మల్టీ ప్రొడక్ట్‌ వ్యవసాయ ఆధార పరిశ్రమలు నెలకొల్పుతామని జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడు ప్ర‌క‌టించారు.

ఈ థ‌ర్మ‌ల్ ప్లాంట్‌ ను నిర‌సిస్తూ అక్క‌డ ప్ర‌జ‌లు గ‌త ఐదున్న‌రేళ్లుగా దీక్ష‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. 2008 నుంచి ఈ దీక్ష‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. జీవో ర‌ద్దు చేసినందున ఇక దీక్ష‌లు విర‌మించాల‌ని మంత్రి అచ్చెన్నాయుడు వారికి విజ్ఞ‌ప్తి చేశారు. ఈ ప్లాంట్ ర‌ద్దుతో ఇదే జిల్లాలో ఉన్న మ‌రో థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్‌ ప్లాంట్ కాక‌రాప‌ల్లికి కేటాయించిన భూముల‌ను కూడా ప్ర‌భుత్వం ర‌ద్దు చేస్తుంద‌న్న ఆశ‌తో రైతులు ఉన్నారు. సిక్కోలు ప్ర‌జ‌ల పోరాటం ఎలాంటిదో ఈ జీవో ర‌ద్దుతో మ‌రోసారి రుజువైంది.