బాబు ట్విట్టర్ ఖాతా మార్ఫింగ్ అయిందట

Wed Jan 11 2017 11:08:15 GMT+0530 (IST)

టెక్నాలజీ వాడకంలో ముందుండే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి ట్విట్టర్ ఖాతాను గుర్తుతెలియని వ్యక్తులు మార్ఫింగ్ చేశారని అధికార వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఆయన కుమారుడు - టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేరిట కామెంట్లు ఉన్నాయి. సినీనటుడు - లోకేశ్ మామ నందమూరి బాలకృష్ణ వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి విడుదల సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ట్వీట్ చేసిన చిత్రం ఒకటి సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేసింది.

ముఖ్యమంత్రి అధికారిక ఖాతా నుంచి లోకేష్ పేరుతో శుభాకాంక్షలు వెలువడటం పట్ల పలువురు విమర్శలు చేయగా..ఇంకొందరు కామెంట్లు చేశారు.  ఆ ట్వీట్ లో చంద్రబాబుకు బాలకృష్ణ మామయ్యగా  పేర్కొనడంతో ట్విట్టర్ లో పెద్ద ఎత్తున సెటైర్లు వచ్చాయి. ఈ పరిణామం ఏపీ అధికారులను తీవ్ర ఇబ్బందికి గురిచేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రాథమికంగా విచారణ చేసిన అధికారులు మార్ఫింగ్ జరిగినట్లు గుర్తించారు. మార్ఫింగ్ ను తీవ్రంగా పరిగణించిన ఏపీ ప్రభుత్వం.. చర్యలు తీసుకునేందుకు సిద్ధమయిందని సమాచారం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/