Begin typing your search above and press return to search.

ఛానల్ పుణ్యమా అని మంత్రి వికెట్ పడింది

By:  Tupaki Desk   |   27 March 2017 5:51 AM GMT
ఛానల్ పుణ్యమా అని మంత్రి వికెట్ పడింది
X
ఎవరు అవునన్నా.. కాదన్నా మీడియా కారణంగా చాలానే విషయాలు బయటకు వస్తున్నాయి. అధికారంలో ఎవరున్నా.. మీడియాలో ప్రముఖంగా వచ్చే అంశాలపై మనసులో ఎలా ఉన్నా.. ప్రజాగ్రహానికి గురికాకుండా ఉండేలా నిర్ణయాలు తప్పనిసరి. ఎక్కడిదాకానో ఎందుకు..ఏపీలో తాజాగా చోటు

చేసుకున్న ఉదంతాన్నే చూస్తే.. సీనియర్ ఐపీఎస్ అధికారిపై అధికారపక్ష ఎంపీ.. ఎమ్మెల్యేలు దురుసుగా వ్యవహరించటం.. ఈ ఉదంతం మీడియాలో ప్రముఖంగా రావటం.. ముఖ్యమంత్రి స్పందించటంతో..అప్పటివరకూ తామేం తప్పు చేయలేదని.. సుద్దపూసలమన్నట్లుగా మాటలు చెప్పిన నేతలు కాస్తా.. జరిగిన దానికి సారీ చెబుతూ..లెంపలేసుకున్న వైనాన్నిమర్చిపోకూడదు.

ఏపీలో కాబట్టి మాటలు.. సారీలతో బండి నడిచిపోతుంది. కానీ.. కేరళలో అలా కాదు..మాట జారిన మంత్రిపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పది నెలల వ్యవధిలో రెండో మంత్రి వికెట్ పడిపోవటం..ఆరాష్ట్రానికే చెందుతుంది. కేరళలోని సీపీఎం నేతృత్వంలోని ప్రభుత్వం.. తమ నేతలపై వచ్చే ఆరోపణల విషయంలో చాలా సీరియస్ గా ఉంటుంది.

తాజాగా 72 ఏళ్ల ముసలి మంత్రి ఏకే శశీంద్రన్ పై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఒక మహిళతో ఆయన అశ్లీలంగా మాట్లాడినట్లుగా వార్తలు వచ్చాయి. మంత్రిగారి మాటల్ని అక్కడి ‘‘మంగళమ్’’ అనే ఛానల్ టెలికాస్ట్ చేసింది.అంతే.. వెనువెంటనే చోటు చేసుకున్న పరిణమాలతో మంత్రిగారివికెట్ పడిపోయింది. మరింత.. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ వృద్ధమంత్రిపై ఆదివారం ఉదయం ఆరోపణలు వస్తే.. సాయంత్రం నాటికి మంత్రి తన పదవికి రాజీనామా చేసేశారు.

అలా అని.. ఈ వృద్ధ మంత్రి ట్రాక్ రికార్డేమీతక్కువేం కాదు.. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సత్తా ఆయన సొంతం. అయినా..తప్పు చేసిన వెంటనే..వారిపై వేటు వేసిన వైనాన్ని చూసినప్పుడు.. ఏపీలో తన నేతల మీద ఏ తరహా చర్యలు తీసుకోవాలో బాబు ఆలోచించుకుంటే మంచిది. ప్రతి విషయాన్నదేశంలో తాను తప్పించి ఎవరూ చేయలేరన్నట్లుగా చెప్పే చంద్రబాబు..కేరళ ప్రభుత్వం వ్యవహరించిన రీతిలో చేయగలరా? అన్న సూటిప్రశ్నకు సమాధానం చెప్పగలరా?


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/