Begin typing your search above and press return to search.

దక్షిణాదిలో పాగాకు కమల వ్యూహం..!

By:  Tupaki Desk   |   19 Feb 2019 4:50 PM GMT
దక్షిణాదిలో పాగాకు కమల వ్యూహం..!
X
లోక్‌ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ భారతీయ జనతా పార్టీ ఏ ఒక్క అవకాశాన్ని వదులుకునేలా కనిపించటం లేదు. ఉత్తరాది రా‌ష్ట్రాలలో బలహీన పడుతున్న ఆ పార్టీ అక్కడ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మహారాష్ట్రలో శివసేనతో తాజాగా పొత్తు కుదుర్చుకుంది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు తన చూపును దక్షిణాది రాష్ట్రాల వైపు మళ్లించింది. ముందుగా తమిళనాడులోని అధికార అన్నాడిఎంకె - పీఎంకె పార్టీలతో పొత్తు కుదుర్చుకుంది. ఈ పొత్తులో భాగంగా తమిళనాడు లోక్‌ సభ ఎన్నికలలో సీట్ల పంపిణీని కూడా పూర్తి చేసింది. మొత్తం 39 స్దానాలు ఉన్న తమిళనాడులో 5 స్దానాల నుంచి బిజేపీ పోటి చేయాలని నిర్ణయించింది. మిగిలిన స్దానాలలో పీఎంకె పార్టీకి 7 స్దానాలు కేటాయించింది. ఇక రాష్ట్రంలో మిగిలిన 27 లోక్‌సభ స్దానాలు అధికార అన్నాడిఎంకెకు కేటాయించారు. ఈ విధంగా తమిళనాడులో పాగా వేయలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించుకుంది. ఇక మిగిలిన పుదుచ్చెరి లోని ఒకే ఒక స్దానాన్ని ఏ పార్టీకి కేటాయంచకపోయినా ముగ్గురూ కలసి ఒక అభ్యర్ది గెలుపుకోసం పనిచేయాలని నిర్ణయించారు. ఈ పొత్తు - కొత్త స్నేహం అంశాలను తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి - ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం - కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ సంయుక్తంగా ప్రకటించారు.

తమిళనాడులో దశాబ్దాల తర్వాత ఏర్పడిన మెగా కూటమి తప్పక విజయం సాధిస్తుందని మూడు పార్టీలకు చెందిన నాయకులు ధీమాగా ఉన్నారు. ఇదే విషయాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి కూడా ఇదే స్పష్టం చేసారు. మరోవైపు తమిళనాడులోని ప్రాంతీయ పార్టీలతో కలసి పనిచేసేందుకు తామూ సిద్దంగా ఉన్నామని భారతీయ జనతా పార్టీ జాతీయా నాయకుడు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. చెన్నైలోని ఓ హోటల్లో అన్నాడీఎంకే, పీఎంకే పార్టీలకు చెందిన నాయకులు సమావేశం అయ్యారు. సమావేశం అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం మాట్లాడుతూ పొత్తులో భాగంగా పీఎంకేకు 7 చోట్ల స్దానాలు ఇవ్వడంతో పాటు రాజ్యసభ సీటు కూడా ఇస్తామని చెప్పారు