Begin typing your search above and press return to search.

680 కోట్ల‌తో జంప్ అయిన ఉద్యోగి

By:  Tupaki Desk   |   23 Feb 2017 1:47 PM GMT
680 కోట్ల‌తో జంప్ అయిన ఉద్యోగి
X
వంద కాదు రెండు వంద‌లు కాదు ఏకంగా 680 కోట్ల రూపాయ‌లకు స‌మాన‌మైన నిధుల‌ను ఉద్యోగి స్వాహా చేశాడు. స్విట్జ‌ర్లాండ్ కేంద్రంగా ఉన్న ఏబీబీ కంపెనీకి చెందిన‌ ద‌క్షిణ కొరియా శాఖ‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఏబీబీ కంపెనీ ఉద్యోగి ఒక‌రు 680 కోట్ల‌(వంద మిలియ‌న్ల డాల‌ర్లు)తో ఉడాయించాడు. రెండు వారాల క్రితం ఏబీబీ కంపెనీకి చెందిన ఉద్యోగి అదృశ్య‌మ‌య్యాడు. ఆ త‌ర్వాత కంపెనీకి చెందిన నిధులు క‌నుమరుగైన‌ట్లు గుర్తించారు. ఆ విలువ‌ వంద మిలియ‌న్ల డాల‌ర్లు ఉంటుంద‌ని తేల్చారు.

ఏబీబీ సంస్థకు ప‌వ‌ర్ అండ్ రోబోటిక్స్‌లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుర్తింపు ఉంది.కొరియాలోని ఏబీబీ శాఖ‌లో సుమారు 800 మంది ఉద్యోగులు ఉన్నారు. ఏబీబీలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా సుమారు ల‌క్షా 30 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. కాగా, కంపెనీ నిధుల‌ను దొంగ‌త‌నం చేసేందుకు అనుమానిత వ్య‌క్తి బ‌య‌ట వ్య‌క్తుల‌తో డాక్యుమెంట్ల‌ను ఫోర్జ‌రీ చేసిన‌ట్లు గుర్తించారు. అయితే డ‌బ్బుల‌తో ఉడాయించిన అత‌ను హాంగ్‌ కాంగ్ వెళ్లి ఉంటాడ‌ని అనుమానిస్తున్నారు. అత‌న్ని ప‌ట్టుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. కంపెనీలో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌లు కేవ‌లం కొరియా వ‌ర‌కు మాత్ర‌మే వ‌ర్తిస్తాయ‌ని కంపెనీ పేర్కొంది. ఈ వార్త కార్పొరేట్ ప్ర‌పంచంలో క‌ల‌క‌లం రేకెత్తించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/