Begin typing your search above and press return to search.

సూదిగాడే కాదు.. సూదిగత్తె కూడానంట

By:  Tupaki Desk   |   3 Sep 2015 5:18 AM GMT
సూదిగాడే కాదు.. సూదిగత్తె కూడానంట
X
నిన్న మొన్నటి వరకూ ఉభయ గోదావరి జిల్లాల్ని వణికించిన సూదిగాడి స్థానే.. మరో తలనొప్పి మొదలైంది. ఇప్పటికే సూదిగాడ్ని పట్టుకోవటం కోసం పోలీసులు కిందామీదా పడుతుంటే.. తాజాగా సూదిగాడితో పాటు.. మరో సూదిగత్తె కూడా ఎంట్రీ ఇవ్వటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. దారిన పోయే వారిపై ఇంజెక్షన్ సిరంజితో దాడి చేయటం.. తమ దారిన తాము పోవటం.. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా కనిపించిన వారి మీద సూదితో దాడి చేస్తున్న సూదిగాడిని పట్టుకోవటం కోసం పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించటం లేదు.

ఇప్పటికే సూదిగాడికి సంబంధించి రెండు ఊహా చిత్రాల్ని పోలీసులు విడుదల చేయటం తెలిసిందే. తాజాగా.. సూదిగాడి మాదిరే.. సూదిగత్తె (సూది లేడి) కూడా సీన్లోకి వచ్చేసింది. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన పాలిటెక్నిక్ విద్యార్థిపై సిరంజి దాడికి సూదిగాడితో పాటు.. మరో లేడీ ఉండటం ఇప్పుడు అయోమయానికి దారి తీస్తుంది.

తనపై ఒక జంట సిరంజితో దాడి చేసినట్లుగా సదరు విద్యార్థి ఫిర్యాదు చేశాడు. ఈ జంటకు సంబంధించిన పోలికల్ని ఆధారంగా తీసుకొని పోలీసులు వీరి ఊహాచిత్రాల్ని విడుదల చేశారు. ఎవరికి చిక్కకుండా.. అమాయకుల్ని లక్ష్యంగా చేసుకొని వేధింపులకు గురి చేస్తున్న ఈ సైకో సూది జంటను పోలీసులు అదుపులోకి తీసుకునే వరకూ గోదావరి జిల్లాల ప్రజలకు కంటి నిండా కనుకు పట్టని పరిస్థితి నెలకొంది