Begin typing your search above and press return to search.

సిద్ధూకు షాక్.. మూడు రోజుల పాటు నిషేధం!

By:  Tupaki Desk   |   23 April 2019 5:21 AM GMT
సిద్ధూకు షాక్.. మూడు రోజుల పాటు నిషేధం!
X
మాజీ క్రికెట‌ర్.. పంజాబ్ కాంగ్రెస్ నేత న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూకు కేంద్ర ఎన్నిక‌ల సంఘం దిమ్మ తిరిగేలా షాకిచ్చింది. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా నోటికి ప‌ని చెప్పిన ఆయ‌న‌పై మూడు రోజులు నిషేధం విధిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఇటీవ‌ల కాలంలో ఎన్నిక ప్ర‌చారంలో భాగంగా నోటికి వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడుతున్న వారిపై నిషేధం విధిస్తున్న ఎన్నిక‌ల సంఘం తాజాగా సిద్ధూపై కొర‌డా ఝుళిపించింది.

ఈ నిషేధం ఈ రోజు(మంగ‌ళ‌వారం) ఉద‌యం 10 గంట‌ల నుంచి అమ‌ల్లోకి రానుంది. 72 గంట‌ల పాటు ఆయ‌న ఎలాంటి ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన‌కూడ‌దు. ఈ వేటు ప‌డేందుకు కార‌ణ‌మైన ఉదంతంలోకి వెళితే.. ఈ నెల 16న బిహార్ లోని క‌టిహార్ లో నిర్వ‌హించిన స‌భ‌లో సిద్ధూ మాట్లాడారు.

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత.. మాజీ కేంద్ర‌మంత్రి తారిఖ్ అన్వ‌ర్ కు మ‌ద్ద‌తుగా ఆయ‌న ప్ర‌చారాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన సిద్ధూ.. ముస్లిం ఓట్లు చీల్చే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ముస్లింలంతా ఐక్య‌మై ప్ర‌ధాని మోడీని ఓడించాల‌ని పిలుపునిచ్చారు. సిద్ధూ చేసిన వ్యాఖ్య‌ల‌పై పెను దుమారం రేగింది. సిద్ధూ వ్యాఖ్య‌ల్ని ఖండించ‌ట‌మే కాదు.. ఆయ‌న వ్యాఖ్య‌లు విద్వేషాల్ని రెచ్చ‌గొట్టేలా ఉందంటూ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.అదే స‌మ‌యంలో ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేశారు.

ఓవైపు పోలీసులు ఆయ‌న‌పై ఎఫ్ ఐఆర్ దాఖ‌లు చేయ‌గా.. మ‌రోవైపు ఈసీ ఆయ‌న వ్యాఖ్య‌ల్ని ప‌రిశీలించి 72 గంట‌ల పాటు నిషేధాన్ని విధిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. నోటికి వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడి ఈసీ వేటుప‌డిన ప్ర‌ముఖ‌ల్లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్‌.. కేంద్ర‌మంత్రి మేన‌కా గాంధీ.. బీఎస్పీ అధినేత్రి మాయావ‌తి.. స‌మాజ్ వాదీ పార్టీ నేత ఆజంఖాన్ లు ఉన్నారు. తాజాగా సిద్ధూ ఈ జాబితాలో చేరిన‌ట్లైంది.