Begin typing your search above and press return to search.

సింధూతో పెళ్లి చేయండి..లేదంటే కిడ్నాప్ చేస్తా!

By:  Tupaki Desk   |   18 Sep 2019 6:19 AM GMT
సింధూతో పెళ్లి చేయండి..లేదంటే కిడ్నాప్ చేస్తా!
X
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ గెలిచిన మన తెలుగమ్మాయి పీవీ సింధూ ఆటతీరును టీవీల్లో చూసి ముగ్ధులు కాని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు.. చిరుత లాంటి ఆమె వేగం.. లేడీ లాంటి పరుగు.. ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టే ఆమె మేనరిజం అందరినీ ఆకట్టుకుంటుంది. సింధూ ఆటను చూసిన ఓ వృద్ధుడు కూడా ఫిదా అయిపోయాడు.. చేసుకుంటే ఆమెనే చేసుకుంటానంటూ మంకు పట్టు పట్టాడు..అంతేకాదు.. సింధూతో తనకు పెళ్లి చేయాలంటూ ఏకంగా కలెక్టర్ కు అర్జీ పెట్టుకున్నాడు. ఈ వృద్ధుడి వింత ప్రతిపాదన చూసి ఆ కలెక్టర్ కు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదట..

తమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజాదర్భార్ ను కలెక్టర్ నిర్వహించాడు. ఈ సందర్భంగా మలైస్వామి అనే 70 ఏళ్ల వృద్ధుడు కలెక్టర్ కు దరఖాస్తు పెట్టుకున్నాడు. వృద్దుడిది ఏ సమస్య అని అర్జీ చదివితే కలెక్టర్ షాక్ అయ్యాడు.. ‘సింధూ ఆటతీరు నన్ను విపరీతంగా ఆకట్టుకుంది.. పెళ్లంటూ చేసుకుంటే ఆమెనే పెళ్లి చేసుకుంటా.. నాకు 16 ఏళ్లు.. 2004 ఏప్రిల్ 4న జన్మించాను..’ అంటూ తన ఫొటోను సింధూ ఫొటోను జతచేసి పిటీషన్ లో పేర్కొన్నాడు.

ముసలాడి వింత కోరికను చదివి అక్కడున్న కలెక్టర్ సహా అధికారులంతా ఆశ్చర్యపోయారు. తనకు మాత్రం సింధూతో పెళ్లి చేయాల్సిందేనని వృద్ధుడు మంకు పట్టు పట్టాడు. లేదంటే సింధూను కిడ్నాప్ చేసేందుకైనా వెనుకాడనని మలైస్వామి చెప్పడం విశేషం. దీన్ని బట్టి సింధూ అంటే ఆ ముసలాడి ఎంత పిచ్చో అర్థమైపోయింది.