Begin typing your search above and press return to search.

జే సెట్ కు భారీ స్పందన

By:  Tupaki Desk   |   22 April 2017 6:03 AM GMT
జే సెట్ కు భారీ స్పందన
X
ఎంసెట్ - ఎడ్ సెట్ - ఈసెట్... వంటివి చాలా విన్నాం కానీ ఈ జేసెట్ ఎప్పుడూ వినలేదు కదా. అవును.. ఇది కొత్త ఎంట్రన్స్ టెస్ట్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీకి సేవలందించేందుకు నిర్వహించే పరీక్ష ఇది. తెలుగు రాష్ర్టాల్లో మొట్టమొదటగా అనంతపురం జిల్లాలో నిర్వహించిన ఈ పరీక్షకు మంచి స్పందన వచ్చింది.

వివిధ విభాగాల్లో జనసేన పార్టీకి సేవలు అందించేందుకు 4,500 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అనంతపురంలో జనసేన ఎగ్జామ్ టెస్టు జరగనుండగా, వ్యాఖ్యాత విభాగానికి 3,800 మంది, విశ్లేషకుల - రచయితల విభాగానికి 700 మంది దరఖాస్తు చేసినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. క్షేత్ర స్థాయిలో జనసేన బలోపేతానికి ప్లాన్ వేసిన పవన్ కల్యాణ్ - వీరందరికీ పరీక్ష - ఇంటర్వ్యూలు నిర్వహించి - ఆపై నియామకాలు చేపట్టేందుకు నిపుణులతో కూడిన కమిటీని నియమించారు.

నియామకాలు పూర్తయిన తరువాత త్వరలోనే పార్టీ తొలి కార్యాలయం అనంతపురంలోనే ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యాలయాన్ని పవన్ ప్రారంభిస్తారు. కాగా త్వరలో మిగతా జిల్లాల్లోనూ ఇలాంటి రిక్రూట్ మెంట్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. త్వరంలోనే పార్టీ వెబ్ సైట్లో దీనికి సంబంధించిన సమాచారం ఉంచనున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/