Begin typing your search above and press return to search.

అమెరికాలో క‌ల‌క‌లం..42 మంది భార‌తీయుల అరెస్ట్‌

By:  Tupaki Desk   |   22 Jun 2018 10:27 AM GMT
అమెరికాలో క‌ల‌క‌లం..42 మంది భార‌తీయుల అరెస్ట్‌
X
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ప్రభుత్వం వలస విధానాన్ని సీరియస్‌గా తీసుకోవడంతో గత కొన్ని రోజులుగా అమెరికాలో పెను దుమారం చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఇమ్మిగ్రేషన్ చట్టాలను అమెరికా ప్రభుత్వం పటిష్టంగా అమలు చేస్తుండ‌టం...వంద‌లాది మందిని అరెస్టులు చేస్తుండ‌టంతో వివిధ దేశాల నుంచి అమెరికాకు అక్రమంగా వెళ్లిన వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.ఈ క్ర‌మంలో తాజాగా భార‌త్ క‌ల‌క‌లం చెందే ప‌రిణామం చోటుచేసుకుంది. అమెరికాలో 42 మంది భారతీయులను అరెస్టు చేశారు. వారంతా అక్రమంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఓరేగాన్ - న్యూమెక్సికోలో ఈ అరెస్టులు జరిగాయి.

అధ్య‌క్షుడు ట్రంప్ సర్కార్ త‌మ దేశంలోని అక్రమ వలసదారులను విషయంలో అమెరికా క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో భాగంగా చేస్తున్న త‌నిఖీల‌లో మెక్సికోలోని ఎల్‌ పాసో బోర్డర్ వద్ద భారతీయులు చిక్కినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే భారతీయుల అరెస్టుపై స్థానికంగా ఉన్న అధికారులు ఈ అంశాన్ని కనుగొనేందుకు చర్యలు చేపట్టారు. ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ తో భారత అధికారులు టచ్‌ లో ఉన్నారు. న్యూ మెక్సికోలోని ఒటెరో కౌంటీ డిటెన్షన్ సెంటర్‌ లో సుమారు 42 మంది భారతీయులు ఉన్నట్లు ఐసీఈ వెల్లడించింది.

న్యూమెక్సికోలో ఉన్న సెంటర్‌ ను త్వరలో విజిట్ చేయనున్నట్లు దౌత్యకార్యాలయం వెల్లడించింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు ఎంబసీ పేర్కొంది. అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించిన భారతీయుల వివరాలు వాళ్ల బంధువుల నుంచి తెలిసినట్లు సమాచారం. అయితే భారతీయులను ఎప్పుడు, ఎక్కడ పట్టుకున్నారన్న విషయం అర్థం కావడం లేదని భారతీయ అధికారులు వెల్లడించారు. ఇదిలాఉండ‌గా... డిటెన్షన్ సెంటర్‌ లో ఉన్న వారితో ఎవరైనా మాట్లాడవచ్చు. వాళ్లు కావాలంటే న్యాయవాది సాయాన్ని తీసుకోవచ్చు.